మన మహిళామణులు

శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ! -సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

శాంతిశ్రీ

నిర్మొహమాటంగా మనసులో మాటను విప్పి చెప్పే ఆమె విద్యావతి . ఢిల్లీలో రాణించిన తెలుగు బిడ్డ.ఆరోజుల్లోనే తన జీవితంలో కొత్త అధ్యాయం కి శ్రీకారం చుట్టారు.ఆమెయే శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ.గుంటూర్ లో పుట్టి పెరిగిన ఆమె తండ్రి పొగాకు వ్యాపారి.బాల్యంనుంచీ ఏలోటులేకుండా ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన భాగ్యశాలి శాంతిశ్రీ.నిరాడంబరత పుస్తకాలు ఒంటరితనం అంటే ఎంతో ఇష్టం.నల్గురు అక్క చెల్లెళ్ల మమత ప్రేమ ఆప్యాయత తో పాటు బాల్యం నుంచి వక్తృత్వ వ్యాసరచన నాటకాలు డిబేట్ నృత్యం..ఇలా అన్నింటిలో బడి కాలేజీ రాణించారు.ఆటలు ఆడుతూ చురుగ్గా ఆల్రౌండర్ గా పెరిగి ఎం.ఏ.తర్వాత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో ఎం.ఫిల్.చేశారు.పి.హెచ్.డి.కి రిజిష్టర్ చేయించినా కుటుంబ బాధ్యతల వల్ల పూర్తి చేయలేదు.శ్రీ ప్రనాబ్ ముఖర్జీ గారి తో పరిచయం ప్రేమగా మారి 1983 లో పెళ్లి రెండో ఘట్టం.ఇద్దరు కుమార్తెలు.పెద్దమ్మాయి .పెద్దమ్మాయి భర్త మరాఠీ సాఫ్ట్వేర్.కూతురు న్యూయార్క్ లో అమెరికన్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగం.చిన్నమ్మాయి బెర్లిన్ లో ఒక అంతర్జాతీయ సంస్థలో పనిచేస్తోంది.స్త్రీవాది.స్వతంత్రభావాలుతన కాళ్లపై నిలబడాలనే ఆశయం.

శాంతిశ్రీ తండ్రిగారు మల్లవరపు ఇన్నయ్య చౌదరి. తల్లి సరోజినీ దేవి. చిన్నమ్మాయి స్త్రీవాది. మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడే కార్యకర్త. చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలు కలది శాంతిశ్రీ. ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడాలను కునేది. కట్నం తీసుకునే పద్ధతికి వ్యతిరేకి. కట్నం తీసుకోకుండా తనను ఇష్టపడే వ్యక్తినే వివాహం చేసుకోవాలన్న ఆలోచన కలది.
శాంతిశ్రీ 2015 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.భర్తసలహాపై రచనా వ్యాసంగం పుస్తకాలప్రచురణ ఆమె జీవితం లో భాగంగా మారాయి.బాల్యంనుంచీ పుస్తకాలు ఆమె ఫ్రెండ్స్.డిటెక్టివ్ నవలలు మొదలు చలం కొడవటిగంటి అబ్బూరి ఇలా దాదాపు అందరి సాహిత్యాన్ని ఆపోసనపట్టారు.బి.ఎ.లో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుని షేక్స్పియర్ కీట్స్ మొదలైన వారి సాహిత్యంచదవడంతో ఆంగ్ల తెలుగు భాషలపై మంచి పట్టు లభించింది.భర్త 2018 లో రిటైర్ అయినందున హైదరాబాద్ లో స్థిరపడ్డారు.ఇక చిన్న కూతురుకి తెలుగు చదవడం రాకున్నా తల్లి తో భావాలు పంచుకోవడంతో శాంతిశ్రీగారి రచనలో కొత్త
దనం భావాలు అక్షరరూపం దాల్చాయి.ఆమె రచనల్లో స్త్రీ వాదం మానవహక్కుల అవగాహన ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.ట్రావెలాగ్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో అంతర్జాల పత్రికల్లో వచ్చాయి.2022లో కథా సంపుటి ” మానుషి” కవితాసంపుటి ” ఆలంబన” మంచి పేరు గుర్తింపు తెచ్చాయి.

శాంతిశ్రీ బెంగాలీ సాహిత్యం కూడా చదివారు. రవీంద్రుడు, శరత్ చంద్ర చటర్జీ, విభూతి భూషణ బందోపాధ్యాయ, ఆషాపూర్ణాదేవి మొదలైన బెంగాలీ రచయితలు ఆమెను ప్రభావితం చేశారు.
వ్యాసాలు ఈమాట అంతర్జాల పత్రిక లోనూ, మహిళా మార్గం లోనూ, నమస్తే తెలంగాణ దినపత్రిక లో నూ, కొన్ని సంకలానలోనూ వచ్చాయి.
ఆమె నిష్కపటంగా నిర్మొహమాటంగా తన జీవితంలో సంఘటనలు ఇలా వివరించారు ” నాజీవితం వడ్డించిన విస్తరి కాదు.ఎన్నో సంఘర్షణలు ఆటుపోట్లు ఎదుర్కొన్నాను.నాది కులాంతర భాషాంతర వివాహం.మా అత్త గారు వాళ్ళు పెళ్లి కి ఒప్పుకోలేదు.2 ఏళ్ళు మౌనంగా ఇద్దరం ఎదురుచూశాం.నాకు హైదరాబాద్ లో జాబ్ రావడంతో ఢిల్లీ వదిలి వెళ్తానని చెప్పడం మావారు తన పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి ఖాయం చేయడం జరిగింది.ఎంతో ఆడంబరంగా ఆచార సాంప్రదాయాలు తో మా పెళ్ళి జరిగింది.తలపై ముసుగు వేసుకోడం(గూంగట్) పాపిట్లో సింధూరం తెలుపు ఎరుపు గాజులు కంపల్సరీ గా ధరించాల్సిందే.చీరెకట్టు లో కూడా ఆంక్షలు! రాంచీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.మాపెద్దమామగారు నేను బ్రాహ్మిణ్ కాదని తెలిసి భోజనం చేయకుండా వెళ్లి పోయారు.

నేను జాబ్ చేయడం ఎవరికీ ఇష్టం లేదు.బెంగాలీలో మాట్లాడేవారు.క్రమంగా నేర్చుకుని బెంగాలీ భాషలో ప్రవీణురాలైనాను.ఇది వ్యక్తిగత జీవితం.

ఇక ఉద్యోగం లో కూడా అంతులేని పోరాటం చేశాను.ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన కాలేజీ లో చాలా ఏళ్ళు పనిచేశాను.పర్మనెంట్ కాలేదు.తీన్మూర్తి భవన్ లో పర్మనెంట్ జాబ్ దొరికింది.సాహితీవేత్తలు కూడా స్వలాభం చూసుకుంటారని తెల్సింది. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అనే సంస్థ లో selected works of Jawaharlal Nehru
Project లో రిసెర్చ్ ఆఫీసర్ గా అసోసియేట్ ఎడిటర్ గా ఎదిగాను.నెహ్రూప్రసంగాలు విదేశీ పర్యటనలు
పుస్తకాలకు ముందు మాట రాయడం వ్యక్తిగత
అధికారిక లేఖలు ఎడిట్ చేసి వాల్యూం గా తీసుకుని రావడం ఫుట్ నోట్స్ ఇవ్వడం మాటర్ కోసం లైబ్రరీలు పాత పేపర్లు జర్నల్స్ చదవడం నా జాబ్ లో పని.ఎడిటింగ్ క్లుప్తంగా మంచి అర్థం వచ్చేట్టు రాయడం ఇంకో ఎత్తు.ఇవి నాజీవితానుభవాలు” అంటూ వివరించారు శాంతి శ్రీ గారు.అనుకున్నది సాధించిన తెలుగుమహిళ స్ఫూర్తి దాత.ఆమెకు
తరుణి తరుఫున ధన్యవాదాలు..

ఆమె అత్తగారింట్లో ఆమె జాబ్ చెయ్యడం ఇష్టం లేదు. ఎప్పుడూ తలమీద ముసుగు వేసుకుని ఉండ మనేవారు ఆమెను. ఆమె కొన్నింటిని నిరాకరించడం వలన ఆమెకు చదువు కున్నానని, ఉద్యోగం చేస్తున్నానని గర్వం అని బంధువులు అనుకునేవారు. మొదటినుంచీ బెంగాలీ లోనే మాట్లాడే వారు. మొదట్లో తికమక పడినా ఆమె నెమ్మదిగా నేర్చుకున్నారు. ఇప్పుడు అనర్గళంగా బెంగాలీ లో మాట్లాడగలరు.
ఆమె ఆలస్యంగా రాయడం మొదలుపెట్టి నందు వలన ప్రారంభం లో సంకోచం తోనూ, ఆత్మన్యూనతా భావం తోనూ బాధపడే వారని, పేరుగాంచిన సాహిత్య కారుల సపోర్ట్ కోసం, ప్రోత్సాహం కోసం తాపత్రయ పడేవారని చెప్పారు. అది దొరక్క పోగా, ఆమెను దూరం పెట్టడం జరిగిందని, అది ఆమెకు ఎంతో మనస్తాపం కలిగించిందని, సాహిత్యకారులు కూడా స్వంత లాభం చూసుకుంటారని, మామూలు మనుషులలో ఉండే బలహీనతలు వాళ్ళలో ఉంటాయని తెలిసి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కొందరు మిత్రుల సహాయ, సహకారాలు లభించినా చాలావరకు స్వయంకృషి వలనే తట్టుకుని నిలబడ్డారని తెలిపారు.

చివరిగా ఆమె అంటారు మనకు నచ్చిన పనులు చెయ్యడానికి వయస్సుతో సంబంధం లేదు. బెటర్ లేట్ దెన్ నెవెర్ అన్నది విలువైన వాక్యం. మనకు ఆనందం కలిగించే పనులు చెయ్యడానికి మనం చేసే కృషి లోనే సాఫల్యత, సంతృప్తి కలుగుతుంది. విజయం ముఖ్యం కాదు.గమ్యం కూడా ముఖ్యం కాదు. మనం చేసే ప్రయాణం లో స్నేహం, ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ముందుకు సాగి పోవాలనే అవగాహనే ముఖ్యం అంటారు ఆమె!
శాంతి శ్రీ గారి నెంబర్ 9871989360

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉద్యమ సారధి

సమయం…