ఎడారి కొలను 

ధారావాహికం – 11 వ భాగం

ఇప్పటివరకు: జరిగిన సంఘటనల వలన మైత్రేయి నిద్ద్ర లో పీడకలలతో ఆందోళన పడుతుంటుంది. తనకొచ్చే మైత్రేయి ఆదాయం చేయిజారిపోతుందేమోనన్న భయంతో సుబ్బారావు తన లాయర్ కోదండపాణి ద్వారా కాంప్రమైస్ కోసం ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం  ఫలించలేదు.   మూడు నెలల తరువాత కేసు కోర్ట్ ముందుంచాడు ఇన్స్పెక్టర్ రమణ మూర్తి  

ఆ రోజు కోర్ట్ కి వెళ్లాల్సిన రోజు. అక్కమ్మ తోటి   కోర్ట్ కి చేరుకుంది మైత్రేయి. ఇన్స్పెక్టర్ రమణ మూర్తి గారు కలిశారు. తన చేత ఫార్మాలిటీస్ కొన్ని పూర్తి చేయించారు. రాజ్య లక్ష్మి వచ్చింది కేసు ఫైల్ తోటి. వస్తూనే రమణ మూర్తి గారి ని కలిసి మాట్లాడింది. వసుంధర కోసం ఎదురు చూస్తున్నారు.

తెల్లటి అంబాసిడర్ కార్ లో ఆరోజు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి విజయమ్మ గారు దిగారు. కోర్ట్ ప్రాంగణ మంతా  అలెర్ట్ అయింది. గబా గబా బంట్రోతు కిష్టయ్య పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి చేరుకొని వెనక సీట్లో ఉన్న కొన్ని ఫైల్స్ పట్టుకొని విజయమ్మ గారి వెంట నడిచాడు. ఆమె  చాల హుందాగా తన ఆఫీస్  రూమ్ లోకి ప్రవేశించింది.

“ఎలా ఉన్నారు కిష్టయ్య గారు”.

“ఆ దేవుడి దయవల్ల అంత బాగానే ఉన్నది అమ్మగారు”.

“మీ అమ్మాయిని కాపురానికి పంపించారా” .

“లేదమ్మా ! M A పరీక్షలు అయ్యాక పంపుదామనుకుంటున్నాను. నేనేమి ఆస్తులు ఇవాలేనమ్మా. ఎదో అంత మాత్రం చదువు  ఉంటే దాని కాళ్ళమీద అదే నిలబడుతుంది”.

“మంచిమాట చెప్పారు కిష్టయ్య గారు. ఇలా ప్రతి తల్లి తండ్రులు ఆలోచిస్తే మన సమాజమే మారిపోతుంది. ప్రతి ఆడపిల్ల కి కొంత ఆర్ధిక స్వేచ్ఛ వస్తుంది”.

“అది సరే! ఇవాళ ఎన్ని కేసులు వొచ్చాయి మన దగ్గరికి.”

“ఉదయం సెషన్ లో రెండు కేసు లు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాఖలు చేసాడు మేడం. వాటిలో ఒకటి గృహ హింస కేసు కూడా ఉంది.”

“ఓహ్  అలాగా!”అంటూ సాలోచనగా చూసింది జస్టిస్ విజయమ్మ గారు.

కోర్ట్ హల్లోకి ముందుగ బంట్రోతు కిష్టయ్య వెళ్లి  కోర్ట్ కారవాయి మొదలవబోతున్నది అందరు హాజరయి నిశబ్దం గ కూర్చోండి అని అనౌన్స్మెంట్ చేసాడు.

విజయమ్మగారు హుందాగా తమ స్థానం దగ్గరి కోచ్చి నిలబడి అందరికి నమస్కారం చేసి కూర్చున్నారు. ప్రతిగా కోర్ట్ లో ఉన్నవారంతా గౌరవార్ధం లేచి నిలబడి ఆమెకు ప్రతి నమస్కారం చేసి నిశబ్దం గ కూర్చున్నారు.

2వ  టౌన్ ఇన్స్పెక్టర్ రమణయ్య గారు ముందుకొచ్చి శాల్యూట్ చేసి అయన చేతిలో ఉన్న ఫైల్ ని అక్కడ ఉన్న P A కి అందించారు. ఆ ఫైల్ ని జస్టిస్  ముందర పెట్టింది టైపిస్ట్.  మీరు చెప్పవచ్చు అంటూ ఇన్స్పెక్టర్ వంక చూసారు విజయమ్మ గారు.

“ 498A of IPC ( గృహ హింసనుండి మహిళల రక్షణ చట్టం, 2005) శ్రీమతి మైత్రేయి తన భర్త శ్రీ సుబ్బారావు తనను శారీరకంగా హింసించాడని కేసు పెట్టటడం జరిగింది. అందుకు తగిన విధంగా ఎంక్వయిరీ జరిపి సాక్ష్యా ధారాలు  సేకరించిన తరువాత   సదరు శ్రీ సుబ్బారావు గారి కి అరెస్ట్ వారెంట్ ఇవ్వబడింది. అయన బెయిలు మీద ఉన్నారు”. అంటూ కేసు పూర్వ పరాలను  వివరించారు.

“అయితే శ్రీమతి మైత్రేయి గారిని హాజరుపర్చండి విందాము “ అని ఆమె అన్నారు.

మైత్రేయి పేరు పిలువబడింది. భయం భయంగ వచ్చింది  జడ్జిగారి  పోడియంకి పక్కాగా ఉన్న ఒక చెక్క కుర్చీలో ఆమెను కూర్చో మన్నారు.

“ఎమ్మా అస్సలు ఏమయిందో వివరించగలుగుతావా”. అని అన్నారావిడ.

కొద్దీ సేపు తానేమి మాట్లాడలేక పోయింది. మళ్ళి  విజయమ్మ గారే “నీకేమి భయం లేదు. నువ్వు నిర్భయంగా చేప్పోచ్చు“ అని భరోసా కూడా ఇచ్చారు. ధైర్యాన్ని కూడా కట్టుకొని చెప్పటానికి ప్రయత్నించింది మైత్రేయి. స్పష్టంగ చెప్పలేక పోతున్నది. గొంతులో బాధ, అవమానం కలగలిపి రాయిలా  గొంతుకి అడ్డుపడుతున్నాయి.

“ నీ తరఫున మాట్లాడడానికి ఎవరినైనా పెట్టు కున్నావా “.

“లేదు”  అని తల అడ్డంగా ఊపింది.

మర్యాద పూర్వకంగ “ మేడం జస్టిస్ , మీరు అనుమతిస్తే మానవతా దృక్పధంతో ఆమె కేసుని నేను ఆమె తరఫున వివరిస్తాను. అలాగే వాదించటానికి కూడా మీ పర్మిషన్ కోరుకుంటున్నాను. అని లాయర్ వసుంధర విజయమ్మ గారిని అభ్యర్ధించింది. పరిస్థితి  అర్ధమయినందున  విజమ్మ గారు వెంటనే ఆమెకి పర్మిషన్ ఇచ్చారు.

“మేడం జస్టిస్,  శ్రీమతి మైత్రేయి చాల గౌరవమైన వృత్తి  లో ఉన్నందు  వలన, ఆమె కు కోర్ట్ వారు   In Camera ఫెసిలిటీ ఇవ్వవలసిందిగ కోరుకుంటున్నాను.” అని అడగగానే, “అలాగే , మరి మీ కేసు ని రేపు ఉదయానికి వాయిదా వేస్తాను. రేపుదయం కోర్ట్ కారవాయి మీ కేసు తోనే మొదలవుతుంది,” అని చెప్పి, మైత్రేయికి వెళ్లిపోవటానికి అనుమతినిచ్చారు.

ఈ కేసు కి సంబంధించిన వారు తప్ప రేవు ఉదయం కోర్ట్ హాల్ లో ఎవరు ఉండకూడదని, దానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించింది  జస్టిస్ విజయమ్మ.

(ఇంకా ఉంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమయం…

సాటి మనిషిగా.. సాటి మనీషిగా: