మానవుల మనోభావాలకు అంగికభాష-సైగలు, వాక్కులు సంకేతం. ఆ సంకేతాలకు మరో క్లుప్త రూపం ప్రతీకలు, సంజ్ఞలు, రంగులు, సంఖ్యలు మొదలైనవి. సంఖ్యలకు సంకేతాలను ‘మహావీరాచార్యుడు’ తన గణితసారసంగ్రహం’లో వివరించాడు, ప్రయోగాలు చేసాడు.
మహావీరాచార్యుడు.
క్రీ.శ. 9వ శతాబ్దంలో కర్ణాటకప్రాంతాన్ని రాష్ట్రకూట వంశీయుడైన అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి పరిపాలించాడు. ఇతను జైనమతావలంబి. కళాసాహిత్యాలను పోషించాడు. ఈ చక్రవర్తిన్వయంగా వండితుడు. ఇతను స్వయంగా ‘కవిరాజమార్గమనే సాహిత్యశాస్త్రగ్రంంథాన్ని రచించాడని అంటారు. ఈ చక్రవర్తి ఆస్థానాన్ని అలంకరించిన మహామేధావి ‘మహావీరాచార్యుడు’, అనాటి కాలంలో గణితశాస్త్రంలో మహావీరాచార్యునికి సాటి
లేరు.
చీకటిలో ఎన్నో వస్తువులుంటాయి. ఏదీ కానరాదు. అవి ఉన్నా లేనట్లే. దీపం వెలిగించినప్పుడే వీటి ఉనికి, స్వరూపస్వభావాలు గోచరమవుతాయి, అలాగే సమస్త చరాచర జగత్తును అవగాహన చేసుకోవడానికి గణితజ్యోతిని
ప్రసాదించాడని ‘మహావీరాచార్యుడు’ అంటారు. అందుకే జినదేవునికి
ప్రణతులర్పించి, తన గ్రంథం ‘గణితసారసంగ్రహం’ ప్రారంభించాడు, ఈ గణిత సారసంగ్రహగ్రంథాన్ని 8
అధ్యాయాలు, 1131 శ్లోకాలలో రచించాడు. ఇందులో
సుమారు వెయ్యిసమస్యలను ప్రస్తావించాడు. ప్రపంచంలో ఏ మతం వారికైనా గణితం అనేది అనేక శాస్త్రాల్లో అది ఒక శాస్త్రగ్రంథం మాత్రమే. కాని జైనులకు అది మోక్షప్రదమైన నాలుగు అనుయోగాల్లో ఒకటి. గణిత ప్రసక్తిలేని వస్తువుకు ఈజగత్తులో అస్తిత్వమే లేదని మహావీరాచార్యుడంటాడు. ఈ మహావీరుడు సృష్టించిన మానాలను (కొలతలను) తెలుగువాడైన పావులూరి మల్లన స్వీకరించాడు.
పావులూరి మల్లన:
‘గణితసారసంగ్రహం’ గ్రంథాన్ని పావులూరి మల్లన పది (10) అధ్యాయాలతో, “సారసంగ్రహగణితం” అనే
పేరుతో తెలుగులోకి అనువదించాడు. దీనినే ‘దశవిధ గణితమని శాస్త్రజ్ఞులంటారు.
పావులూరి మల్లన గ్రామం గుంటూరుజిల్లా బాపట్లలో ఉంది. రాజరాజనరేంద్రుడు పావులూరు మల్లన కు (బ్రాహ్మణవండితుడికి పిఠాపురం సమీపంలో ఉన్న ‘నవఖండవాడ’ అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి, గౌర వించాడు. అచ్చంగా అదే పేరుగల ఆ తాతగారి మనుమడు తెలుగులో మొట్టమొదటి గణితశాస్త్రగ్రంథ నిర్మాతై నాడు. తెలుగుసాహిత్యానికి నన్నయ కొత్తపునాదులు వేస్తే, తొలి శాస్త్రగ్రంథానికి మల్లన మార్గం చూపాడు.
గణితసారసంగ్రహం రాసిన మహావీరుడు జైనుడు. మహావీరుని గ్రంథంలోని జైన వాసనగల సంబోధ నలు, సంఖ్యాపదజాలం, ఉదాహరణ సమస్యలు, సన్నివేశాలను మల్లన చాలావరకు తన గ్రంథంలో తొలగించాడు. వాటిని మల్లన శైవవరంగా కూర్చాడు.
ఈ గణితగ్రంథాల్లో వీరు సంఖ్యలకు బదులుగా ఉపయోగించిన సాహిత్య, సాంస్కృతిక సంబంధిత సంకేతాల ప్రభావం, తెలుగు రాష్ట్రాల్లోని శాసనాలపైన ఉంది.
పూర్వకాలంలో శాస్త్రరచనలు పద్యగద్యాల్లో సంక్షిప్తంగా రాసేవారు. ఆ పద్యగద్యాలు వినసొంపుగా ఉండేటట్లు మరియు గుర్తుంచుకొని జ్ఞాపకం చేయడానికి అనువుగా ఉండేటట్లు ఛందోబద్ధమైన
పద్యగద్యాల్లో రాసేవారు. ఛందస్సుకు అనుగుణంగా సంఖ్యలు ఒదగడానికి అంకెలకు ప్రత్యామ్నాయంగా సాహిత్య
సాంస్కృతిక అంశాలను సంకేతాలుగా ప్రవేశపెట్టారు. వీరి ఈ పద్ధతి సమకాలీన సమాజంపై ప్రభావాన్ని చూపింది. కాబట్టి
ముందుగా పావులూరిమల్లన సంకేత సంఖ్యలకు చెప్పిన, ఉపయోగించిన పదజాలం గురించి తెలుసుకొన్న తర్వాత, శాసనాల్లోని సంకేతసంఖ్యల గురించి తెలుసుకుందాం.
పైన చెప్పుకున్న వారిద్దరి ప్రభావం మన తెలుగుశాపనాలపైన ఉందని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
భాషలో అర్థానికి స్థిరత్వం లేదు. అది నిరంతర పరిణామశీలం కలిగినది. కాని గణితసూత్రాలు నిత్య సత్యాలు, ప్రతిరాశి, ప్రతి నిర్వచనం, ప్రతి పరిక్రియ స్థిరమైన కచ్చితమైన అర్థంలో వ్యక్తమవుతుంది. ఏ మాండ లిక భాషాభేదాలు గణితానికి వర్తించవు. మల్లన సృష్టించిన గణితంలో వాడిన ‘సాహిత్య సాంకేతిక పారిభాషిక పదజాలం’, సమకాలీన సమాజ పై శాసనాలపై ప్రభావాన్ని చూపింది. ఆ విషయాన్ని ‘నల్లగొండజిల్లా శాసనములు, వరంగల్ జిల్లా శాసనములు, మహబూబ్నగర్ జిల్లా శాసనములు, ముఖలింగదేవాలయ చరిత్ర – శాసనములు (శ్రీకాకుళంజిల్లా)’ అను గ్రంథాలద్వారా నిరూపించవచ్చు. ముందుగా సంఖ్యల సంకేతాల గురించి తెలుసుకుందాం.
శాసనాలు చరిత్రకు ప్రామాణిక సాక్ష్యాలు:
గణితశాస్త్రంలో సంజ్ఞలను ఉపయోగించి, సుదీర్ఘమైన సంఖ్యలను, రాతను కుదించి చెప్పారు. దానివల్ల విద్యార్థులకు భాషాపటిమ, జ్ఞాపకశక్తి, సాంకేతికత పెరగడం, మెరుగవడమే
గాకుండా క్లుప్తీకరణ కూడా సాధ్యమౌతుంది. ఉదా. క్లుప్తపదాలు శత, సహస్ర, అయుత్, నియుత్….
శత (100),
సహస్ర (1000),
అయత్ (10000),
నియత్ (100000),
ప్రయుత్ (1000000),
అర్బుద్ (10000000)
స్యర్బుద్ (100000000),
సముద్ర్ (1000000000),
మధ్య (10000000000),
అంత్ (100000000000),
పరార్థ్ (1000000000000),
ఉసన్ (10000000000000),
వ్యుస్తి (100000000000000),
దేశ్యత్ (1000000000000000),
ఉద్వత్ (10000000000000000),
ఉదిత్ (100000000000000000),
సవర్ణ (1000000000000000000),
లోక్ (10000000000000000000).
ఇదే పద్ధతిని (క్లుప్తపదాలను, సంజ్ఞలను) శాసనాలలో సంఖ్యలను చెప్పడానికి కూడా ఉపయోగించారు.
శాసనాలలో సంవత్సరాలను పేర్కొనడాన్ని కూడా ఒక శాస్త్రంగానే భావించారని చెప్పవచ్చు. శాసనాల లో సంఖ్యలకు బదులుగా ఎక్కువగా – సూర్యచంద్రులను, భూమిని, త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, అగ్నులను, ఆదిత్యులను చేర్చారు. శాస్త్రం’సంజ్ఞలు’ లేకుండా ఉండదు. ఈ కారణంగా శాసవాలలోని సంజ్ఞల గురించి, అలాగే ఆ సంజ్ఞల్లో
వెల్లడైన సాహిత్య సాంస్కృతికాంశాల గురించి కూడా తెలుసుకుందాం. అంతేగాకుండా అర్థంల లేని చదువు వ్యర్థం కాబట్టి మల్లన్న చెప్పిన సంజ్ఞలకు, ఆ తర్వాతి వారు చెప్పిన సంజ్ఞలకు సాధ్య మైనంత వరకు వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మల్లన వాడిన పారిభాషిక పదజాలం –
ఒకటి నుండి తొమ్మిది వరకు, మరియు సున్న అంకెకు పరిభాష లేదా సంజ్ఞలు, వివరాలు:
శ్లోకం : ఒకటి(1)కి సంజ్ఞలు
అర్థాలు:
శశీ సోమశ్శశాంకశ్చ ఇందుశ్చ చంద్రశ్చ రూపకమ్ ప్రళయం భూమి విలయం మృగాంకశ్చ కళాధరః భూ వాచకాస్తు శబ్దా యే ఏకస్థానన్య వాచకాః
(మల్లన చెప్పిన అవతారిక వచనం (37)
–
అ) శశీ, సోమః, శశాంక, ఇందుఁ, చంద్రః, మృగాంకః (మృగాంకుడు), కళాధరః(కళాధరుడు) – చంద్రుడు, ఆ) భూమి, భూవాచకాలు భూమి
ఇ) రూపకం = నాటకం
ఈ) ప్రళయం= కల్పాంతం
ఉ) నిలయం = ఇల్లు
శ్లోకం: రెండు (2)కు సంజ్ఞలు :
అక్షిః చక్షుః కరం నేత్రం లోచనం బాహు కర్ణకమ్ పక్ష దృష్టి ద్వయం యుగ్మమంబకం నయనాఖ్యకమ్
అక్షి, చక్షు, నేత్రం, లోచనం, అంబకం, నయనం = కండ్లు, – కన్ను, కంటిచూపు
దృష్టి
=
బాహు = రెక్కలు, భుజాలు
ఇ) పక్ష(ము)
= నెలలో పదిహేను రోజులు, రెండుపక్షాలు = ఒక నెల)
ఈ) కర్ణకమ్
= చెవులు
ఉ) ద్వయం, యుగ్మ(ం) = జత, రెండు
శ్లోకం: మూడు (3)కు సంజ్ఞలు :
వహ్నీ రామశ్శిఖీ రత్నం పావకో దహనోనలః
శంకరాక్షిపురీ లోకాస్త్రయః
కాలాస్త్రయోగుణాః
అర్థాలు:
అ) పహ్నీ(వహ్ని), శిఖీ, పావక,
దహనః, అనలః = అగ్ని, అగ్నులు.
అగ్నులు మూడు. అవి: (అ) గార్హపత్యం (పిత), (అ) దక్షిణాగ్ని (మాత), (ఇ) ఆహవనీయం (గురువు)
ఆ) రామ = రాముడు. ముగ్గురు రాముళ్లు – 1. వరశురాముడు, 2. కోదండరాముడు, 3. బలరాముడు
ఇ) రత్నం = బౌద్ధత్రిరత్నాలు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి.
ఈ) శంకరాక్షి (శంకర అక్షి) = శివుని త్రినేత్రాలు
ఉ) పురీ = శివుడు దహించినవి- 1. విద్యున్మాలిపురం, 2. తారాకా క్షునిపురం 3. కమలాక్షునిపురం
ఊ) లోకాస్త్రయః = త్రిలోకాలు -1, భూలోకం, 2. స్వర్గలోకం,
3. పాతాళ లోకం
ఋ) కాలాన్తయః = మూడు కాలాలు -1. భూత, 2. భవిష్యత్, 3. వర్తమానం
ౠ) గుణాః = 1. సత్వ
2. రజ, 3. తమోగుణాలు
శ్లోకం: నాలుగు (4)కు సంజ్ఞలు :
అర్థాలు:
అబ్ధిసాగర బ్రహ్మాస్య వనరాశి యుగార్ణవాః
చతుర్వార్ధిర్వేదా జలధిన్నీరధి స్తథా
అ) అబ్ధి, సాగర, అర్ణవాః, చతుర్వర్ధి, జలధి, నీరధి = సముద్రం (సముద్ర సంజ్ఞ = 4, నాలుగు సముద్రాలు)
అప్
వారి
జలం
– నీరు,
– సముద్రం,
– నీరు, వార్ధి – సము ద్రం, – నీరు, జలధి – సముద్రం,
–
వన
=
–
నీరు, వనరాశి సముద్రం
అర్థం – నీరు, అర్జవం – సముద్రం, చతుర్వార్థి:- నాలుగు సముద్రాలు
–
ఆ) బ్రహ్మాస్య బ్రహ్మముఖాలు బ్రహ్మనాలుగు ముఖాలు
యుగ = నాలుగు యుగాలు -1. కృత, 2. త్రేతా, 3. ద్వావర, 4. కలియుగాలు (యుగసంజ్ఞ = 4 సంఖ్య)
ఈ) వేదా = నాలుగు వేదాలు, ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలు (వేద = 4 వేదాలు)
శ్లోకం: అయిదు (5)కు సంజ్ఞలు :
ఇంద్రియ పంచ జ్ఞానం కావ్యం బాణశ్చ మార్గణః
వ్రతభూతవిషయ శర ముష్టి కళ్యాణ భూషణమ్
అర్థాలు:
అ) ఇంద్రియం = పంచేంద్రియాలు -1) చెవి, 2. చర్మం, 3. కన్ను, 4. నాలుక, 5. వాసిక, వీటినే జ్ఞానేంద్రియాలు అంటారు.
ఆ) పంచమం = అయిదవది, రాగవిశేషం, స్వరం (సరిగమ పదని)
ఇ) జ్ఞానం – జ్ఞాన ఇంద్రియాలు.
ఈ) కావ్యం = పంచమహాకావ్యాలు-1, రఘువంశం, 2. కుమారసంభవం,
3. మేఘసందేశం లేదా నైషధీయచరిత్రం, 4. కిరాతార్జునీయం, 5. శిశుపాలవధ(సంస్కృతం)
ఉ) బాణః, శర = మన్మథునిబాణాలు – ఐదు, 1, అరవిందం, 2. అశోకం, 3. చూతం(మామిడి) 4. నవమల్లిక 5 నీలోత్పలం (నీలికలువ), (శర = బాణం, మార్గణః = బాణం)
ఊ) ప్రత -?? (పంచ వ్రతాల సమాచారం లభించలేదు)
(అష్టవ్రతములు, ద్వాదశ వ్రతముల గురించి సమాచారం లభిస్తున్నది – నం.వ.కో. పుట. 1899)
ఋ) భూత = పంచభూతాలు-1.వృథివి(భూమి),2, జలం(నీరు) 3. తేజస్సు, 4. వాయువు(గాలి), 5. ఆకాశం
ౠ) విషయ = పంచవిషయాలు-1, రూపం, 2, రసం, 3, గంధం, 4. స్పర్శ, 5, శబ్దం, ఇవి జ్ఞావేంద్రియ
విషయాలు.
లు) ముష్టి = ఐదువేళ్లు.
1. పతాక ముష్టి, 2. వజ్ర ముష్టి, 3. సింహకర్ణ ముష్టి, 4. మత్సరి ముష్టి, 5. కాకతుండి ముష్టి.””
లూ) కళ్యాణ = పంచ కళ్యాణాలు, పంచమహోత్సవాలు: 1. సురలోక అవతరణోత్సవం (గర్భావతరణకళ్యాణం) 2. జన్మాభిషేకోత్సవం (జన్మాభిషేక కళ్యాణం) 3. పరినిష్క్రాంతి మహోత్సవం (పరినిష్క్రమణకళ్యాణం) 4. కైవల్యబోధోత్సవం కైవల్యజ్ఞానకళ్యాణం) 5. మోక్షోత్సవం (మోక్షకళ్యాణం)
ఎ) భూషణమ్ =ృ 1. ధర్మం, 2. 3. న్యాయం, 4. యజ్ఞం, 5. విల్లు(యుద్ధం)
శ్లోకం: ఆరు (6)కు సంజ్ఞలు :
అర్థాలు:
ఋతు శాస్త్ర రసం చైవ షడ్దర్శన షడంగకమ్
తర్కం షడ్గుణ షట్కంచ ద్రవ్యార్థం ఋత వస్తథా
ఋతు, ఋత= ఆరు ఋతువులు -1. వసంతం, 2. గ్రీష్మం, 3. వర్షం, 4. శరత్ 5, హేమంతం, 6. శశిరం
ఆ) శాస్త్ర = ఆరు శాస్త్రాలు – 1, తర్కం, 2. వ్యాకరణం, 3. అలంకారం, 4. మీమాంస, 5. ధర్మశాస్త్రం, 8. నీతిశాస్త్ర
ఇ) రసం
= ఆరు రసాలు – 1. మధురం (తియ్యనిది), 2. ఆమ్లం (పులుపు), 3. లవణం (ఉప్పు), 4. కటువు (కారంకలది), 6, కషాయం (ఒగరు), 6. తిక్తం (చేదు)
ఈ) షడ్దర్శన :
ఆరు దర్శనాలు. అవి: 1. న్యాయం, 2. వైశేషికం, 3. వేదాంతం, 4. మీమాంస, 5. సాంఖ్యం,
6. యోగం
ఉ) షడంగకమ్
= 1. శిక్ష 2. వ్యాకరణం, 3. ఛందస్సు 4. నిరుక్తం, 5. జ్యోతిషం, 6. కల్పం
ఊ) తర్కం = ఆరు శాస్త్రాలు – 1. తర్కం, 2. వ్యాకరణం, 3. అలంకారం, 4. మీమాంస, 5. ధర్మశాస్త్రం, 6. నీతిశాస్త్రం
ఋ) షడ్గుణ = ఆరు గుణాలు– 1. జ్ఞానం, 2.శక్తి, 3. ఐశ్వర్యం, 4. బలం, 5. వీర్యం, 6. తేజన్సు
ౠ) షట్కం = ఆరు- 1, కామం, 2. క్రోధం, 3. లోభం,
4. మోహం, 5, మదం, 6. మాత్పర్యం
లు) ద్రవ్యం = 1. జీవుడు, 2. పుద్దలం, 3. ధర్మం, 4. అధర్మం. 5. కాలం, 6. ఆకాశం
లూ) వస్తథా = 1. 2. 3, 4, 5, 6
(వః, తథా, వన్ తథా) ??????
శ్లోకం: ఏడు (7) కు సంజ్ఞలు :
అద్రిశైలనగాఅశ్వాస్సప్తచాచలచగోత్రతాః
మునిర్గిరి తురంగా చ నగ దారా
(ఘాపయోః)
అ) అద్రి, శైల, నగ, గిరి, అచల = పర్వతం
1. ఉదయ, 2. అస్త, 3. హిమ 4. వింధ్య 5. మేరు, 6. త్రికూట 7. లోకాలోక పర్వతాలు
లేదా
1. మహేంద్రం 2. మలయం 3. సహ్యం, 4, మాల్యవంతం, 5, ఋక్షం, 6. వింధ్యం, 7. పారియాత్రం
ఆ) అశ్వా, తురంగ = సూర్యుని ఏడుగుర్రాలు.1. గాయత్రి, 2. బృహతి, 3. ఉష్ణ, 4. జగతి, 5. త్రిష్టుప్, 6. అనుష్టుప్, 7. పంక్తి
ఇ) గోత్రః, ముని – సప్తర్షుల (మునుల) గోత్రాలు.
(సప్తర్షుల సమూహాలు మరియు వారి
పేర్లు పది రకాలుగా ఉన్నాయి. అంటే
పది సమూహాల సప్త ఋషులు ఉన్నారు (10 x7=70 పేర్లు.
(ఏదేని ఒక సమూహాన్ని మాత్రమే మనం తీసుకోవాలి)
ఉ) సప్త 7.
శ్లోకం: ఎనిమిది(8)కి సంజ్ఞలు :
అష్టమం గజకర్ణచ దిగ్గజం దస్తీ హస్తికమ్
ద్విరదం మత్తమాతంగ వన్నగా వను వారణాః
అ) అష్టమం – 8
ఆ) గజకర్ణ, దిగ్గజం, దనీ, హస్తికమ్, ద్విరదం, మత్తమతంగ, వారణా(ణం) = ఏనుగు(ఎనిమిదిదిక్కులకు
ఎనిమిది ఏనుగులు, అవి:
1. ఐరావతం, 2. పుండరీకం, 3. వామనం, 4. కుముదం, 5. అంజనం, 6. పుష్పదంతం, 7. సార్వభౌమం,
ఇ) పన్నగా = పాములు, వాగములు: 1. అనంతుడు, 2. వాసుకి, 3. తక్షకుడు, 4. శంఖపాలుడు, 5. కుళికుడు, 6. వద్ముడు, 7. మహాపద్ముడు. 8. కర్కోటకుడు
ఈ) పసు(పు) = అష్ట వసువులు : 1, అపుడు, 2. ధ్రువుడు,
3. సోముడు 4. ధ్వరుడు, 5. అనిలుడు,
6. ప్రత్యూషుడు, 7. అవలుడు, 8. ప్రభాసుడు (శ.ర)
శ్లోకం: తొమ్మిది (9)కి సంజ్ఞలు:
నవమం వందనంచైవ బ్రహ్మాపురుష పరార్థకమ్ నిధిర్గ్రహశ్చ వేధాశ్చ భవలబ్ధం చ రంధ్రకమ్
అ) నవమం – తొమ్మిది
ఆ) నందనం – 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9.
(నవనందులు కనిపిస్తున్నారు. కాని నవ నందనాలు కనిపించడం లేదు)
ఇ) బ్రహ్మా – నవబ్రహ్మలు(బ్రహ్మమాననవుత్రులు):
1. భృగువు, 2. పులస్త్యుడు, 3. పులహుడు, 4. క్రతువు, 5. అంగిరసుడు, 6. దక్షుడు, 7. అత్రి, 8. మరీచి, 9. వశిష్ఠుడు
ఈ) పురుషవరార్థకమ్ – 1. 2. 3, 4, 5, 6, 7, 8.9.???
–
ఉ) నిధి : నవనిధులు: 1. మహాపద్మం, 2. పద్మం, 3. శంఖం,
4. మకరం, 5. కచ్ఛపం, 6, ముకుందం,
7. కుందం, 8. నీలం, 9. ఖర్వం
ఊ) గ్రహ – సపగ్రహాలు: 1. సూర్యుడు, 2. చంద్రుడు, 3. అంగారకుడు, 4. బుధుడు, 5. బృహస్పతి, 6. శుక్రుడు, 7. శనైశ్చరుడు, 8. రాహువు, 9. కేతువు
ఋ) వేదా
– 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9.???????????????
X) Sego – 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9.??????????????
లు) రంధ్రకమ్ (ద్వారాలు) – 1. రెండు కన్నులు, 2. రెండు చెవులు, 3. రెండు నాసారంధ్రాలు, 4. నోరు, 5. మలద్వారం, 6. మూత్రద్వారం
శ్లోకం: సున్న(0)కు సంజ్ఞలు:
అర్థాలు:
ఆకాశం గగనం శూన్యం అంబరంచ మరుత్పథమ్
తారాపథం విష్ణుపదం వ్యోమ ఖం దివి పుష్కరమ్
అర్థాలు:
ఆకాశం, గగనం, శూన్యం, అంబరం,
మరుత్ పథమ్, తారాపథం, విష్ణుపదం, వ్యోమ, ఖం, దివి, పుష్కరమ్ = ఆకాశం
ఏకాదశ (పదకొండు) సంజ్ఞ:
ఈశ, రుద్ర
–
ఈశునికి పర్యాయపదాలు: ఈశులు 11: ఏకాదశ రుద్రులు: 11.
1. శివ 2. మహేశ్వరః 3. శంభుః 4. శ్రీకంఠో 5. భవ 6. ఈశ్వరః 7. మహాదేవః 8. పశుపతి 9. నీలకంఠ 10, వృషధ్వజు, 11. రుద్రా.
వివరాలు లభించని సంకేతాలు :
(6):
లూ) వస్తథా = 1. 2, 3, 4, 5, 6
(వః తథా, వన్ తథా) ??????
ఏడు (7) దారా (ఘావయో॥)
తొమ్మిది(9):
ఆ) నందనం
– 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. ?????????
ఈ) పురుష పరార్థకమ్ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.?????????
ఋ) వేధా
-1. 2. 3. 4. 5. 6. 7. 8. 9.?????????
800) 5ogo-1. 2. 3. 4. 5. 6. 7. 8. 9.?????????
(ఈ వ్యాసంలో మల్లన చెప్పిన సంజ్ఞలకు మాత్రమే వివరాలు తెలుసుకున్నాం. వచ్చే వ్యాసంలో శాసనాలో పేర్కొన్న సంఖ్యల సంజ్ఞల గురించి తెలుసుకుందాం.
ఆధార గ్రంథాలు
1. విద్యాన్ తెన్నేటి, పావులూరిగణితం, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2011\
2. విద్యార్థి కల్పతరువు, ప్రథమభాగమ, 1986
3. ఆచార్య రవ్వా శ్రీహరి, సంకేత పదకోశము, పతంజలి పబ్లికేషన్స్ 2002
4. శబ్ద రత్నాకరము, 1992