ఆటస్థలం బాగుంది
ఆటవస్తువులు ఇంకా బాగున్నాయి.
అవి ఇచ్చిన నీవు చాలా బాగున్నావు కదూ…
నాన్న… ఆట, పాట అలుపు సొలుపులేక
తనివితీరా నన్ను క్రీడించమన్నావు.
ఆటలో పడి… ఇన్ని ఇచ్చిన నిన్నే మరిచాను.
అలసట వచ్చినప్పుడు ‘అమ్మా’అని
నిన్నే నిన్నే నిన్నే తలిచెదను.
వస్తువులన్నింట నిన్ను చూసే తలపునాది.
మరి నన్ను నేను చూడటం మరిచితి
నాలో నువ్వు ఇంకా దగ్గర కదా…
అందమైన రంగస్థలాన.. చక్కటి వేషం, భాష, భావం
బహు చిక్కటి హృదయసౌందర్యం…
అయినా ఏదో వెలితి, నీవు నావేలు విడిచి పెట్టినావేమో అని
నాన్నా నాన్నా అంటే చెప్పావు ఒకపని
అర్థమైంది ఇపుడు ఎన్ని పాటలు పాడినా…
ఆటవిడుపుగా వంద ఆటలు ఆడినా…
నువు చెప్పిన ఆట ఒకటి మరవద్దనీ..
నిన్ను వినిపించే చూపించే రహస్యం విడవద్దనీ…
నాన్న.. నీవు చెప్పిన క్రీడలో
వింటున్నా చూస్తున్నా సదా నీ తోనే వుంటున్న….