మన మహిళామణులు

విభిన్న రంగాల్లో రాణిస్తున్న వీణావాణి- సేకరణ… అచ్యుతుని రాజ్యశ్రీ

ఆమె అటవీశాఖ లో ఉద్యోగం చేస్తున్నా సాహిత్యంతో పరిచయం ఉంది.

పరిచయం
పేరు : దేవనపల్లి వీణావాణి
స్వస్థలం : జూలపల్లి మండలం , పెద్దపల్లి జిల్లా
నివాసం : హైదరాబాద్
వృత్తి : తెలంగాణ అటవీశాఖ లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

ప్రస్తుతం
ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ అధికారి, జోగులాంబ సర్కిల్, జిల్లా అటవీ శాఖ అధికారి, నారాయణపేట ( అదనపు బాధ్యత)

విద్యాభ్యాసం : జూలపల్లి, కరీంనగర్ , హన్మకొండ ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్

కుటుంబ వివరాలు: భర్త హరికృష్ణ సిరిమళ్ల, సాఫ్ట్వేర్ రంగం, హైదారాబాద్,
ఒక పాప, వైష్ణవి, 8 వ తరగతి

రాసిన పుస్తకాలు :
1.నిక్వణ కవితా సంకలనం : 2018
2.శిలా ఫలకం కవితా సంకలనం:2020
3.ధరణీరుహ : 2022

సభలు:

ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రాతినిధ్యం
కేంద్ర సాహిత్య అకాడమీ అఖిల భారత యువ రచయితల సమావేశం 2018 కొరకు తెలుగు భాషా ప్రాతినిధ్యం
తెలంగాణ సాహిత్య అకాడమీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం

ఇతర సాహిత్య సమావేశాలు

పురస్కారాలు :
మొదటి పుస్తకం నిక్వణ కు ఐదు పురస్కారాలు

1. సంత్ రామదాసు సేవాలాల్ రాష్ట్ర పురస్కారం 2020
2. క్యాతం కృష్ణారెడ్డి పురస్కారం 2020
3.జింకా రుక్మిణమ్మ ప్రథమ కవితా సంకలనం 2020
4. దేవులపల్లి కృష్ణ శాస్త్రి పురస్కారం 2020
5. శ్రీ అంగల కుదిటి సుందరచారి సాహితీ పురస్కారం 2020

రెండవ పుస్తకం శిలాఫలకం కు రెండు పురస్కారాలు

1. తిరుణగరి శ్రీనివాసాచార్య జాతీయ పురస్కారం 2021
2. పీచర సునితారవు సాహిత్య పురస్కారం 2022

మూడవ పుస్తకం ధరణీ రుహకు మూడు పురస్కారాలు

1. తెలంగాణ సారస్వత పరిషద్ సాహిత్య పురస్కారం -2022
2. కుప్పాంబికా పురస్కారం -2023 అక్షరయాన్ సంస్థ
3.మాలతీ ప్రమద సాహితీ పురస్కారం -2023 , శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్ సంస్థలు , గుంటూరు

ప్రత్యేక పురస్కారాలు.

1. టెర్మినేటర్ సీడ్ కవిత కు తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ ప్రత్యేక పురస్కారం -2022

2. కొలతలు కవిత శ్రీమతి వాసా ప్రభావతి స్మారక కవితా పోటీ లలో ప్రత్యేక బహుమతి -2022

వీణావాణి మాటలలో

నా పేరు దేవనపల్లి వీణావాణి, మాది జూలపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లా. హైదారాబాదులో ప్రస్తుతం ఉంటున్నాం. నలుగురు తోబుట్టువులలో నేను రెండవ దాన్ని. ఉస్మానియా నుంచి వృక్ష శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాను. తదుపరి అటవీశాఖలో ఉద్యోగంలో చేరాను. ఇప్పటికి. పద్దెనిమిది సంవత్సరాలు నుంచి తెలంగాణ రాష్ట్రంలో వివిధ చోట్ల పనిచేస్తున్నాను.

ఉద్యోగరీత్యా దేశంలోని విభిన్న అటవీ ప్రాంతలు పర్యటించాను. మన రాష్ట్రంలో గత పదేళ్లుగా అటవీశాఖ క్రియాశీలంగా ఉండి హరితహారంలాంటి గొప్ప కార్య క్రమాలు నిర్వహించడంలో భాగస్వామ్యం అయ్యాము.

సాహిత్యం మీద ఉన్న అభిరుచితో నిక్వన, శిలా ఫలకం అనే రెండు కవితా సంకలనాలు ధరణీరుహ ఒక పర్యావరణ వ్యాసాల పుస్తకం వెలువరించాను. ఇవి నాకు సాహిత్య లోకాన్ని పరిచయం చేశాయి, గుర్తింపూను ఇచ్చాయి.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం ద్వారా ఎంపిక అయ్యాను.

విధులలో సమయం అంటూ ఉండదు. అటవీ రక్షణ కొరకు నిరంతరం అందుబాటులో ఉంటాము.

విధులలో భాగంగా ఉన్న అడవులను రక్షించడం , కొత్త అడవులను సృష్టించడం లక్ష్యాలు.దీనికొరకు ఏడాది పొడుగునా ఏదో ఒక నిర్దిష్ట కార్యక్రమం కోసం పనిచేయవలసి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భాస్కరుడు

మానవత్వం