తానే లేకుంటే ఈ నిశికి తోడెవరు?
తానే రాకుంటే ఈ వెలుగుకు కారణ మెవరు?
అవమానాల మాటలను తిప్పికొట్టి
అంధకారాన్ని చీల్చి అక్షర జ్ఞానాన్ని పంచిన
ఆ జ్ఞానమూర్తికి అర్పిద్దాం ఘననివాళి….
త్యాగశీలివై…..ధైర్యశాలివై……
చీకటిని చీల్చిన జ్ఞాన జ్యోతి
అక్షర జ్ఞానాన్ని పంచిన వాగ్దేవి-
ధీనుల పాలిట భవ్యభారతి…. అన్యాయాన్ని
ఎదిరించిన ధీరవనిత. నీకు మా నిండు కృతజ్ఞత.
అందరి కోసం ముందడుగు వేసిన త్యాగానివి.
ఆకాశానికెగసిన బాణానివి.
వెలుగు దారి చూపిన “సావిత్రిబాయివి”.
అక్షరమే మార్గదర్శి అన్నావు.గేలి
చేసిన వారిచే ప్రశంస లందుకున్నావు
ప్రేమ మూర్తివై కరుణ చూపించావు.
పాఠశాలను తెరిపించి “జ్ఞాన బోధన” చేశావు.
“విజ్ఞాన బాట”లో నడిచి…
అజ్ఞాతలోకాన్ని తట్టిలేపి….
దేశానికి “మొదటి పంతులమ్మ” వయ్యావు
అందరి కోసం ముందడుగు వేసిన త్యాగానివి.
ఆకాశానికెగసిన బాణానివి.
వెలుగు దారి చూపిన “సావిత్రిబాయివి”.
అక్షరమే మార్గదర్శి అన్నావు.గేలి
చేసిన వారిచే ప్రశంస లందుకున్నావు
ప్రేమ మూర్తివై కరుణ చూపించావు.
పాఠశాలను తెరిపించి “జ్ఞాన బోధన” చేశావు.
“విజ్ఞాన బాట”లో నడిచి…
అజ్ఞాతలోకాన్ని తట్టిలేపి….
దేశానికి “మొదటి పంతులమ్మ” వయ్యావు