కామం లేని ప్రేమ కోసం

కవిత

డాక్టర్ ఆరుట్ల శ్రీదేవి నిజామాబాద్

కలిసి జీవించాలి
కలిసి మరణించాలి
కలిసి జన్మించాలి

కలగన్న ఈ మాట
కల్ల గాగూడదు
ఇలలోన ఈ మాట
నిజము గావాలి

కాముడు పున్నమి పండుగ
అసలు రంగిదే
కాముని కాల్చిన బూడిద
మన నొసలు మెరవంగా
రంగు రంగుల రంగులన్నీ
సప్త రంగులై కలిసి
కౌముది చీకటి లో
శ్వేత రంగయి వెలసి
ఆకాశ రంగులో రంగయి న
ఆత్మానందమై ఆడుకునేదే
వసంత కేళీ హోళీ ఇదే

Written by Arutla Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“పెట్రో గ్రాడ్” రోడ్ – స్ఫూర్తివంత కథనం

కాలబింబం