ఆడది అంటే అమాయక పిల్ల కాదు
అడవిలో అరుదైన పులి పిల్ల
పకృతికే ప్రతిరూపం
అందమైన సుందరం
వికృతి రూపం దాల్చిందో
అంతా వినాశనం
ధైర్యంతో అంతరిక్ష ప్రయాణం చేసినా
సాహసమే ఊపిరై ఆర్మీతో తలపడే సాధనమే ఐనా
బంధాలకు బలం గా
ఓరిమీలో భూదేవిగా
బహుముఖ ప్రజ్ఞశీలిగా
ప్రగతికి పట్టం కట్టింది
ఓ మహిళా!
అమ్మానాన్నల అనురాగంలో అపరంజి బొమ్మవై
అన్నా చెల్లెల అనుబంధంలో సుమగంధానివై
మగని ప్రేమించే మకుటం లేని మహారాణివై
చెలిమితోడ చెరగని చిరు స్వప్నానివై
అన్ని రంగాలలో ఆకుంఠిత దీక్షతో అలరారే నీవు
మనుగడలో మరెందరికో ఆదర్శప్రాయురాలిగా
నిలవాలి
నింగి నేల మెచ్చే
స్వేచ్ఛా విహంగంలా
_**_
మహిళా మణులందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు