కణిక ఆధ్వర్యంలో మేటి మహిళ పురస్కారాలు.

ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనే థీంతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న 2024 మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా రంగాలలో నిష్ణాతులైనటువంటి మహిళలను ఎన్నో సంస్థలు గౌరవిస్తూ వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని జ్ఞాపికలను అందజేయడం జరుగుతూ ఉంటుంది. అట్టడుగు స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు మహిళ యొక్క పాత్ర మహోన్నతమైనది ఆమె లేకుంటే అసలు ధరణి లేదు కుటుంబ వ్యవస్థ లేదు సమాజమే లేదు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను నిర్వహిస్తు..ఉదయం నుండి సాయంత్రం వరకు కృషి చేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయినులను గుర్తించింది ఈసారి కణిక.


“కణిక సాహిత్యం సామాజిక సేవ విద్యారంగ వేదిక ” అనబడే సమూహం 2018లో ప్రారంభించి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు సాహితీసేవ, సామాజిక సేవ విద్యారంగంలో తమవంతు సేవలను అందిస్తూ ఉన్నామని, కణిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి కులకర్ణి అన్నారు. మీరు ఒక కవయిత్రి, రచయిత్రి మరియు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు.
కణిక లో విశిష్టమైన సేవలనందించిన మహిళా మణులకు పురస్కారాలు అందజేయడమే కాకుండా, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా వారు ఉచిత రీతిన సన్మానించి ” కణిక -మేటి మహిళ” పురస్కారాన్ని అందజేశారు.

సాహిత్య రంగంలో కణిక ద్వారా సేవలందించిన శ్రీమతి వినీలా విజయదుర్గ, సత్య నీలిమ వలిపే, విజయ కుమారి బంధు, సత్యవతి దినవహి, వకుళా వాసు, ఉదయభాను బొల్లా ప్రగడ, మద్దెల సరోజన సాహితీ రంగంలో ఎన్నికయ్యారు. ప్రైవేటు విద్యారంగంలో సేవలు అందిస్తున్నటువంటి అంకితభావం గల ఉపాధ్యాయునులలో శ్రీమతి శ్రీ వన్య కటికల, సారా జోనీత, వడ్లోజు ప్రసన్న, మానస, పల్లవి చంద్రిక భార్గవి రేణుక,శ్యామల, శైలజలు,
కొరియోగ్రాఫర్ మిస్ విజయ,
మరియూ మాతృ హృదయంతో సేవలు అందిస్తున్న ఆయాలు శ్రీమతి లలిత శ్రీమతి శీలలు “కణిక -మేటి మహిళ” పురస్కారాన్ని అందుకున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము అంటాము కానీ ఆచరించేది చాలా తక్కువ. మహిళల ఆరోగ్యం అంటే కుటుంబ ఆరోగ్యం. కొన్ని ఏళ్లుగా BMS వెల్నెస్ ద్వారా తమదైన అద్భుతమైన సేవలు మరియూ చైతన్యం ద్వారా వేల మందికి ఆరోగ్యాన్నిస్తూ మార్గదర్శనం చేస్తున్న వెల్నెస్ కోచెస్ శ్రీమతి అఖిలా రాజేష్ మరియూ శ్రీమతి సంపూర్ణ గిరిలకు కూడా కణిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి కులకర్ణి ” కణిక -మేటి మహిళ” అవార్డును ప్రధానం చేశారు.

కణిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రమాదేవి కులకర్ణి మరియు ప్రధాన కార్యదర్శి మిస్ విజయకులకర్ణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము వైభవంగా జరిగింది.

ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనే థీమ్ అందరిలో ఒక చైతన్యాన్ని నింపుతూ స్త్రీలను అన్ని రంగాలలో ముందుకు కలుపుకొని పోవాలి. తమ సంస్థ ద్వారా కూడా ఇలా వివిధ రంగాలలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ప్రతిభకు సేవకి చిరుకానుకగా ఉడుతా భక్తిగా సన్మానాలను అందజేశామని వారు తెలియజేశారు.

                                              

సమాజంలో ఇప్పటికే గుర్తింపు పొందినటువంటి మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు అవసరం ఉండదు, గుర్తింపు లేకుండా అట్టడుగున ఉన్న ప్రతిభాపాటవాలు కలిగిన మహిళలను కూడా వెలికి తీసుకురావడం కణిక చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఒక భాగం అని, ఇది ఇంకా విస్తృతం చేస్తామని విస్మృతులవుతున్న మహిళల యొక్క సామర్ధ్యాలను బయటకు తీయడంలో కణిక ముందుంటుందని రమాదేవి కులకర్ణి గారు తెలియజేశారు.
వీరందరికీ జ్ఞాపికలు శాలువాలు చక్కని ప్రశంసా పత్రాలతో అభినందనలు అందజేశారు.

రమాదేవి కులకర్ణి

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Women’s day – మనం

విహంగం