అలరించడంలో
అదిరించేటప్పుడు దుర్గవు,
బెదిరించడంలో చండివి,
మురిపించడంలో బాలవు,
కొసరి కొసరి తినిపించడంలో అన్నపూర్ణవు,
జ్ఞానమిచ్చుటలో చదువుల తల్లివి,
నీతిని బోధించడంలో గురువు,
కరుణ చూపించడంలో విశాలాక్షివి ,
కోశాధికారిగా మా ఇంట గృహలక్ష్మి ,
శృంగారం చూపించడంలో భర్తకు రతీ దేవి,
పునఃసృష్టికి బ్రహ్మకు సరిసాటి,
భర్తలో సగభాగాన్ని ఆక్రమించిన అర్ధనారీశ్వరివి,
ఎన్ని కళలనైనా అవలోకగా చూపించే విశ్వరూపిణివి,
ఇల్లాలుగా ఇంటికి మహారాణివి మహారాజ్ఞవి….
జగతికి మూలమైన జగతీకందవు నీవు….
నీకు నీవే సాటి.. ఓ మగువా ……. ఓటమి లేని ముదితా ….
నీవు లేని చోటు లేదు…. నిన్ను తలవని రోజు లేదు…
నిన్ను తలవని….పిలవని….ఇల్లు లేదు….
అంతా బ్రహ్మమయం అన్నట్లు….. అంతటా నీ ఉనికిమయం….
అందుకో ఇవే మా జోహార్లు…