Women’s day celebrations

గత కొన్ని దశాబ్దాలుగా మనం మార్చ్ 8న మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్బంగా ప్రతి ఏడాది మనం క్రొత్తగా సాధించిన విజయాలను పునరావలోకనం చేసుకుంటూ, ఈ ఏడాది మరిన్ని కొంగ్రొత్త పుంతలు త్రోక్కే దిశగా అడుగులు ఏవిధంగా వేయాలనే విషయం మీద సమాలోచనలు చేయడం మనకు పరిపాటి. ఇక్కడ మహిళలందరమూ, సాధించిన విషయాలను తలచుకుని గర్వపడటం మాని వినమ్రతతో ఈ ప్రయత్నంలో ఏం కోల్పోయా మన్నదాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఓ ఆంగ్ల సామెతననుసారం, with every gain there is a loss అన్నది మరువలేని, మరువకూడని సత్యం.

ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించింది అపారం….అనంతం! అసూ ర్యంపస్శ్యగా స్త్రీలు కాలం వెళ్ళబుఛ్చిన సమయం నుంచి ఒక్కొక్కమెట్టు పైకి వేస్తూ స్త్రీలు ఈనాడు అంతరిక్షంలో సహితం అడుగుడి విజయపతాకం ఎగురవేస్తున్న రోజులువి. స్త్రీలు సాధించిన. ..సాధిస్తున్న మరెన్నో విజయాలను చూసి పురుషులు సైతం అభినందల వెల్లువలో ముంచెత్తుతున్న తరుణమిది. కానీ సోదరీమణు లకు నేను సవినయంగా మనవి చేసేదేమిటంటే ఇది ఎంతమాత్రము, మనవిజయోత్సాహంలో మనం కోల్పోయిన ప్రాధమిక హక్కులు గురించి ఏ మాత్రం విస్మరించకూడని సమయం. ఈ రోజు స్త్రీ తాను సాధించిన విజయాలకన్నా ఎన్నోరెట్లు అధ:పాతాళానికి నెట్టివేయబడిందని గ్రహించాలి. ఓ మనిషిగా ఆమె అస్తిత్వమే ప్రస్నార్ధకమైపోయింది! కాదనగలరా. …? విజ్ఞానశాస్త్రం అందించిన ఆవిష్కరణలమూలంగా ఈరోజు ఆడపిల్ల భ్రూణ హత్యలకి గురికాపడుతోంది. ఎటు చూసినా ఆమెకు రక్షణ కరువైంది. ఆడది కొందరి పురుషుల కబంధహస్థాలలో చిక్కుకుని దారుణంగా హింసింపపడుతోంది. ఈ అకృత్యాలకు, అత్త్యాచారాలకు కారణమేమిటో ఎప్పుడైనా ఆలోచించారా అక్క చెల్లమ్మలారా?
. కారణం ఎవరోకాదు మిత్రులారా. …మనమే! ఆశ్చర్యపోతున్నారా? ఎస్ మనమే ఇందుకు కారణం, ఇంకా చెప్పాలంటే ఇదంతా మన స్వయంకృతమే కానీ అన్యం కాదు. …! అదేంటంటే అనాదిగా పురుషాధిక్యతని సహించలేని మహిళలు తిరుగుబాటుధోరణి అవలంభించడమే ఇందుకు ముఖ్య కారణం. ..! ప్రకృతి సహజంగానే స్త్రీకి లభించిన సౌకుమార్యాన్ని, స్వాగతించడం మాని, ప్రకృతినే జయించాలన్న ఒకే ఒక లక్ష్యంతో స్త్రీలు ఉద్యమిస్తూ వచ్చ్చారు. ఫలితంగా పురుషుల ఆగ్రహావేశాలకు గురికావలసి రావడం జరిగింది. అంతే కాదు సమానత్వాన్ని సాధించాలన్న తపనలో స్త్రీ ఈ సృష్టి నే ఎదిరించి దుస్సాహసమే చేసిందని చెప్పాలి. ఈ ప్రయత్నంలో ఒక్క అడుగు ముందుకు వేసి, తమ ఓంపుసొంపులను ప్రదర్శించే దుస్తులు ధరించి పురుషునిలోని నిగ్రహ శక్తీకే ఓ సవాలు విసిరింది స్త్రీ! ఫలితమే నేడు స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలూ, మానభంగాలూ. …!!! అందుకే ఇప్పటికైనా స్త్రీలు మేల్కొని, అహంకారాన్ని వీడి అణకువ, వినయం లాంటి సుగుణా లను పెంపొందించికుంటే మనలందరికీ శ్రేయస్కారమని నా అభిమతం. ఎందుకంటే మనిషికి వినయం, నమ్రత అనేవి పెట్టని ఆభరణాలని పెద్దలంటారు! ఇక స్త్రీలకు అవి మరింత వన్నె తెచ్చిపెట్తాయని మహిళలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఒక విధంగా దీనికంతటికీ కారణం మన పితృస్వామ్య వ్యవస్థలో పురుషులలో అనాదిగా ఉన్న ఆధిక్య భావనకీ,నియంత్రు త్వ ధోరణికీ విసిగి పోయినందుచేతే స్త్రీలలో ఈ రకమైన ఎదురు దాడి ఆవిర్భవించడానికి ప్రధాన కారణం కావచ్చు. కానీ సృష్టికి స్త్రీ పురుషులు ఇరువురూ అవసరం! ఏ ఒక్కరు లేకపోయినా కార్యం అసంపూర్ణమే! మానవజాతి బ్రతికి బట్ట కట్టాలంటే ఇరువురి ఉనికి ప్రశ్నార్థకం కాకూడదు.
అంతేకాదు ఏ విషయాన్నైనా ప్రేమతో సాధించగలమే కానీ ప్రతీకార దృష్టితో కాదు. అందువల్ల మనం దుశ్చర్యలను ప్రేరేపించిన వాళ్ళమవుతామని స్త్రీ వాదులు గ్రహించాలి! ఓ రకంగామనమంతా స్త్రీవాదులమే మిత్రులారా! అందుకు సందేహం వొద్దు. మన మహాత్ముడు ప్రబోధించినట్లు ఓ చెంప మీద కొట్తే రెండో చెంప చూపించమని అననుకానీ, ఏ పని సాధించాలన్నా పెద్దలు చెప్పిన సామదానభేద దండోపాయాలను ఉపయోగించడం ఉత్తమమంటాను. మున్ముందు సామం ఉపయోగించి చూడాలి. ఫలించిందా సరే…లేకుంటే మిగతావాటిని ఒక్కొక్కటే అదే ఆర్డల్లో apply చేసుకుంటూ పోవాలి. అంతేకానీ ఓకే సారి దండోపాయం ఉపయోగించడం సరికాదు. అందువల్ల పరిస్థితులు వికటించే ప్రమాదముంది. అందుకే మనమంతాకూడ సంయమనం పాటిస్తూ ముందుకు సాగిపోవడమే తక్షణ కర్తవ్యం! Yes this is the need of the hour! And Last but not the least Let’s not forget the saying “ Slow and steady wins the race friends!“ అందుకే మనం తాబేలులా ప్రతీ అడుగూ ఆచి తూచి వేస్తూ సాగిపోదాం! ఇదే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేనిచ్చే సందేశం! ఇక ఈ రోజు మన సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలందజేస్తూ సెలవుతీసుకుంటున్నాను.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏడాదికో దినం కారాదు ఆడవారి దినం

ఓ తరుణి…….. ఓ మగువ….. కావు….. శిలవు