ఏడాదికో దినం కారాదు ఆడవారి దినం

మహిళ దినోత్సవం సందర్భంగా కవిత

డాక్టర్. అరుణపరంధాములు

నీ నవ్వుకో అర్థం
నీ చూపుకో అర్థం
నీ అందానికో అర్థం
నీ నడకకో అర్థం
నీ బ్రతికే ఓ ప్రశ్నార్థకం
అని ఆంక్షలేట్టిన సమాజం

నిన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే రోజు
నిన్ను హాయిగా బతకనిచ్చే రోజు
నిన్ను ఆర్థికంగా ఎదగనిచ్చే రోజు
నిన్ను నువ్వుగా నిరూపించుకునే రోజు
ఆడ మగ తేడా లేదని చెప్పుకునే రోజు

ఏడాదికో దినం
కారాదు ఆడవారి దినం
క్షణమో యుగంలా గడుస్తుంది
ఆడవారు లేని దినం

ప్రతిరోజు కావాలి
ఆడవారి దినం
అలాంటి రోజులకై ఎదురుచూద్దాం
ఆ రోజే ఆడవాళ్ళందరికీ
శుభాకాంక్షలుతెలియజేద్దాం

నేటి మహిళా మణులందరికీ
అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళను చిన్న చూపు చూడరాదు

Women’s day celebrations