జనని

కవిత

చంద్రకళ. దీకొండ

ప్రకృతి వలె అందాన్ని…
ఆహ్లాదాన్ని అందించే మగువ!

నింగి లోని నిత్యనూతన
వర్ణరంజిత సూర్యోదయంలా…
చిరుజల్లు చిలికించు మేఘమాలికలా…
అధరములపై నిరంతర
చిరుదరహాసమొలికించు మగువ!

పాత్రకు తగ్గ ఆకారము
పొందు నీటి గుణము వలె…
క్రొత్త ప్రదేశంలో…
క్రొత్త పరిసరాలలో…
కొంగ్రొత్త మనస్తత్వాలు కలిగిన
మనుషులున్న మెట్టినింటిని…
తనదిగా మలచుకుని…
కుటుంబంలో తన పాత్రను
సమర్థవంతంగా పోషిస్తూ…
అందరికీ అనుగుణంగా మెలుగు మగువ!

పునర్జన్మ వంటి ప్రసవయాతన ననుభవించిననూ…
వంశాంకురములకు జన్మనిచ్చి…
పుడమి లా సహనం
చూపు మగువ!

నిప్పు లా ఆహార పచనమును చేయుచూ…
కుటుంబసభ్యుల ఆయురారోగ్యాభివృద్ధికై శ్రమించే మగువ!

గాలి లా మానవ మనుగడకు కారణమై…
ఆనంద జీవనమునకాలంబనై…
ప్రేమానురాగాల వరదాయియై…
మమత,మమకారాలు పంచు జననియై…

పంచభూతముల పోలు పరోపకార సుగుణశీలియై…

సృష్టికే అపురూప కానుక మగువ
*************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆడదంటే

దొరసాని