నేనొక ఆడపిల్లను
అడుగడుగున ఆంక్షలే
అసమానతల అడ్డుగోడలు
పుట్టినప్పటినుండి
పుట్టెడు కష్టాల జీవనం
ఎన్నో ఒడిదుడుకలు
నాలో నాకే సంఘర్షణ
ఏమి చేయాలి ?
ఎలా నిలదొక్కుకోవాలి..
నేనే రక్షక భటినైతే
సమాజ రుగ్మతలపై
ధ్వజమెత్తాలనే తపన
రోజురోజుకు పెరుగుతున్న.
అఘాయిత్యాలను చూసి
నా రక్తం సలసల మసలుతోంది
నరరూప రాక్షసుల
భరతం పట్టాలనే కోరిక
అమ్మాయిలను అల్లరి పెట్టే
చిల్లర మూకల అంతం చూడాలని
భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు
గృహహింసలు, ఈవ్ టీజింగ్ లు
లేకుండా చేయాలనే నా అభిలాష
సామాజిక విలువలతో
సమాజాన్ని తీర్చిదిద్దడమే
నేటి యువతుల ద్వేయంగా
ఆత్మస్థైర్యమే ఆయుధమై
అన్నింటా ముందడుగు వేస్తూ
మానవ మృగాలును మట్టి కరిపిస్తూ
అన్యాయంపై పిడికిలి బిగించి
అపర కాళికలా విజృంభించి
పోరాడే ఓ మగువా…..
ఎందరికో స్ఫూర్తిగా
ముందుకు సాగిపో….