\మహిళా! ఓ మహిళా!
మనదినోత్సవమంట. భళా!
అభినందనలివే నీకు
ఈజగతి. ముక్తగళముల
అంజలి ఘటింతుము
వర్ణవర్ణ సుమదళముల
ఆదిశక్తి అంశయై. అనురాగాలవంశమై
మగనిహృది ఒదిగిన వీణవై
మరులజడవాన కురిపించే జాణవై
పతిని పూజించినావు పతిపూజలందినావు
త్రిమూర్తులైన గాని చక్రవర్తులైనగాని
ఒడిలో లాలించి డోలలూగించి
గజపతుల మహితగా
ఛత్రపతి శివాజి మాతగా
జగతినేలు విధాత్రిగా
పతిని అలరించు సుగాత్రిగా
ఏరూపమైనగాని అపురూప రాశి నీవు
నర్తనలో యామిని గా
పన్నాగాల నాగినిగా
మధుర గాయనిగా లోకపావనిగా ఉప్పు తిన్న
విశ్వాసినిగా_ పన్నాయను భామిని గా
అర్గళ నామధారిణిగా
అనర్గళ మధురభాషిణిగా
వియ్యాలు కయ్యాలు నెయ్యాలకు హేతువై
ప్రాచ్య సంస్కృతి పశ్చిమానకు
సేతువై ఖ్యాతి పెంచిన భారతమాత కూతువై
ప్రగతికి పునాది గా
జగమెరిగిన జవరాలవు
నీ ప్రతిభ అనుపమానం
భావి తరుణి ప్రగతిరథం ప్రచోదించు. తరణివి
ఇది నిస్సంశయం