నిరంతర ప్రవాహి -శ్రీమతి గుడిమెట్ల శారద

మహిళాదినోత్సవ ప్రత్యేకం

మన చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిరంతర విద్యార్థిలా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉత్సాహం గా ఉంటుంటారు. వారిని చూస్తుంటే మనం కూడా అలా ఉండాలనే ప్రేరణ పొందుతుంటాం. ఎదుటివారిలో స్పూర్తి నింపుతున్న వారిని చూస్తుంటే “ఎంత బాగా జీవిస్తున్నారో కదా” అనిపిస్తుంది.
అలాంటివారిలో ఒకరు శ్రీమతి గుడిమెట్ల శారద గారు. జ్ఞాన సముపార్జన ను నిరంతర ప్రవాహం లా సాగిస్తూ తనని తాను మెరుగుపరుచుకుంటూ ఆదర్శవంతమైన మహిళ గా నిలుస్తున్నారు.

 

ప్రస్తుతం శారద గారు వైజాగ్ లో నివసిస్తున్నారు. ఆవిడ ఆలిండియా రేడియో లో B గ్రేడ్ ఆర్టిస్ట్. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటి లో MA Music చేశారు. జ్యోతిష్యం లో విశారద, ప్రవీణ చేశారు. అలాగే హింది లో కూడా ప్రవీణ చేశారు.ప్రస్తుతం Vedic Wellness University ( USA) లో ఆన్లైన్ ద్వారా PH D చేస్తున్నారు.
అలాగే సంస్కృతం లో MA చేస్తున్నారు.

వైజాగ్ లోని ఒక CBSE స్కూల్ లో 15 సంవత్సరాలు సంగీత ఉపాధ్యాయురాలి గా చేస్తూ విధ్యార్ధులకి తర్ఫీదు ఇచ్చి పలు పోటీలలో బహుమతులు గెలుచుకునేటట్లు చేశారు.
అలాగే శారద గారు కూడా తెలుగు, హింది, సంస్కృత భాషల దేశభక్తి గీతాల పోటీలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లలో పలు బహుమతులు అందుకున్నారు .

గత 25 సంవత్సరాలు గా మనోరంజని మ్యూజిక్ స్కూల్ నడుపుతున్నారు . 40 మంది కి పైగా డిప్లొమా, ఎం‌ఏ మ్యూజిక్ విధ్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు.

అమెరికా , ఖతార్ , ఒమాన్, ఆస్ట్రేలియా దేశాల విధ్యార్ధులకు ఆన్లైన్ లో తరగతులు నేర్పిస్తున్నారు .

వివిధ రకాల వస్తువులతో క్రాఫ్త్స్ చేస్తుంటారు. పలు టి‌వి shows లో కూడా పాల్గొన్నారు . ఈ టి‌వి సఖి కార్యక్రమo లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేశారు మరియు Zee తెలుగు వారి మీ ఇంటి వంట లో కూడా పాల్గొన్నారు . ఆ విధం గా 100 కు పైగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పైగా మనోరంజని యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తున్నారు.
వారి కుటుంబ సభ్యులు జ్యోతిష్యం , వయొలిన్, మృదంగం, సంగీత, నాట్య , కళాత్మక వస్తువుల తయారీ రంగాలలో నిపుణులు.

నేను ( మాధవి బైటారు) శారద గారి దగ్గర ఆన్లైన్ లో కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. శారద గారు ప్రతిరోజూ మంచి చీర కట్టుకుని, మాచింగ్ నగలు పెట్టుకుని చక్కగా తయారవుతారు. బయటికి వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా చక్కగా తయారవ్వాలని అంటుంటారు . అది అలంకరణ పై ఆమె అభిరుచిని తెలియచేస్తుంది. వారితో మాట్లాడుతుంటే మనలోని నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది.జీవితం పై ఎప్పుడు ఆశావాహ దృక్పధం తో అలుపెరగని నిత్య విధ్యార్ధి లా ఉండే మా శారద మామ్ ని చూసి స్పూర్తి పొందుతుంటాను. వారి గురించి ఇక్కడ పరిచయం చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను .వారి దగ్గర సంగీతం నేర్చుకోవాలనుకుంటే సంప్రదించవలసిన నెంబర్ : 91 90105 20080

అక్టోబరం 2022 తరుణి నుంచి

మాధవి బైటారు

Written by Madhavi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒకానొకప్పుడు…నేడు

ఆలోచనల బంధిఖానా