తవ్వుదామా మనిషి లోతును..!!
పొరలు పొరలుగా దిగులు ఊట
నిశ్శబ్దపు పాయలై చీలుతూ…
మమతలు తప్పిపోయాయి ఎక్కడో
తప్పడం లేదు దేవులాట.
దొరుకుతుందేమోనని ఆశ
దింపుడు కళ్లెం పిలుపుగా….
ఆచి తూచి అడుగులే అనుకుంటూనే
పరిమితిలేని దూరంగా పయనం…
చేతులు కాలిపోతున్నాయి
ఆరాటం దేనికి ఆకుల కొరకు??
నిన్నటిలోకి జారే క్షణాలు..
కనుమరుగవుతున్న కాలం…
పరుగులెత్తే వేగంతో
ఒంటినిండా గాయాలు చీలుతూ
రక్తాశ్రువులు రాలుతున్న నిజాలు…
వెనుకకు చూస్తే
నీడను చూసి భయపడేంత
నిట్టూరుపుల వ్యధలు…
శ్రుతి చేద్దామా
మనసుకో రాగం స్వరమయ్యేలా??
తెగిన తీగలను కలుపుదామా
నిర్నిద్ర గానాలు ఆలపించేలా??
రండి…త్వరపడదాం…!!