మన మహిళామణులు

బొమ్మలతయారీలో తన అనుభవాలను సాధకబాధకాలను వివరిస్తున్నారు దివ్య!

బెంగుళూరు నుండి రకరకాల డాల్స్ ని దారం పూసలతో తయారు చేసి ఏడాదికి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆమె.తనకాళ్ళపై తాను నిలబడాలి అనే దృఢదీక్ష సంకల్పం ఆమె ఆశయంకి బలం చేకూర్చాయి.లలిత అనే తల్లి పేరు పెట్టడానికి కారణం అమ్మ రకరకాల బొమ్మలకి రబ్బరు వాటికి పూసలతో అలంకరించి బట్టలు అల్లేది.ఆమె ఇలా అన్నారు ” నేను చేసిన బొమ్మలు కస్టమర్లకు నచ్చకపోతే ఇంకో కొత్త బొమ్మ చేయాలి.కొరియర్ లో డామేజ్ అవుతాయి.అలా నష్టం వస్తుంది.కొంతమంది మనకు వ్యతిరేకంగా నెగిటివ్ గా మాట్లాడి చాలా నిరుత్సాహ పరుస్తారు.ఇవన్నీ మనం పట్టించుకోకుండా నామార్గాన నేను సాగిపోతున్నాను.”

లలితాడాల్స్ ని ముందుగా మొదలుపెట్టినప్పుడు అసంపూర్తిగా ఉన్న ఒక బొమ్మ ని కస్టమర్ ఇష్టపడటం తో ఆమెకు ఉత్సాహం ఉల్లాసం కలిగించాయి.కానీ పూర్తి గా భారతీయ బొమ్మ లా తయారు చేయడం శ్రమ కష్టం కూడా.కోవిడ్ టైం ల”మా ఓనర్ కి  ఛానెల్ అద్దె ఇవ్వను అని చెప్పి 7వేల రూపాయల తో బొమ్మలవ్యాపారం ప్రారంభం చేశాను” అని స్వానుభవంని చెప్పారు.

మార్కెట్ లో దొరికే అన్ని రకాల ఫైబర్స్ తో ప్లాస్టిక్ బొమ్మలుతో సహా మెరుగులు కొత్త హంగులు పొంగులు అద్దారు.చేత్తో చీరె జాకెట్ కుడ్తారు.వెరైటీ గా ఉండేలాగాపెన్సిల్ తో బొమ్మల స్కెచ్ గీస్తారు.

ఆమె మాటల్లో బొమ్మలతయారీ చదవండి” నాపేరు దివ్య తేజస్వి.మాస్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రమళ్ళగ్రామం.నాన్న వ్యవసాయ దారులు అమ్మ గృహిణి.డిగ్రీతర్వాత పి.జి.ఆంధ్రాయూనివర్సిటీ లో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేశాను.ఎం.ఎస్.చేయాలి యు.ఎస్.వెళ్లాలి అని నాకోరిక.జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను .పెద్దకూతుర్ని.పెళ్లికుదిరింది.బెంగుళూర్లోఉన్న శ్రీ రవితోవివాహం.అక్కడ ఓస్కూల్లోచేరాను.పాపపుట్టింది.బిజీ జీవితం.కోవిడ్ టైం లో  మావారికి జాబ్ ఒడిదుడుకులు జీతం తక్కువ రావటం ఆర్ధిక బాధల్లో కూరుకుపోయాం.

ఆ టైంలో వచ్చిన ఆలోచన లలితాడాల్స్ మేకింగ్.

మానిని ఆడుతున్న బొమ్మ కి చీరకట్టిఫేస్ బుక్ లో పెట్టిన 10 రోజులకి యు.ఎస్.నుంచి ఓకష్టమర్ 20 బొమ్మలకి ఆర్డర్ ఇవ్వడం బొమ్మ తలకట్టు జుట్టు మేకప్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోడంతో నావ్యాపారం ఊపందుకుంది.

దివ్య ఇంట్లోనే అద్దకం పనులు చేస్తూ అచ్చమైన బార్బీ డాల్ ని ముచ్చటైన తెలుగు బొమ్మ గా మార్చి కొత్త ఊపిరి పోశారు.అందమైన బుట్ట బొమ్మలు ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేశాయి.ఆర్డర్స్ పెరిగాయి.6500 పైగా బొమ్మల సెట్లు ఆర్డర్ పై తయారు చేయడం చెప్పినంత తేలిక కాదు సుమా! యు.ఎస్.ఆస్ట్రేలియా కెనడా కీన్యా న్యూజిలాండ్ జర్మనీ లండన్లో సంచలనం సృష్టిస్తున్నాయి.బారసాలమొదలు షష్ఠి పూర్తి దాకా అందెవేసిన చెయ్యి దివ్య.ఇప్పుడు ఆరుగురి సాయంతో భర్త ప్రోత్సాహంతో 150కె.ఫాలోయర్స్ తో ఏడాది కి 3 లక్షల ఆదాయం తో తృప్తిగా ఉంది అంటారు ఆమె.కష్టమర్స్ బడ్జెట్ నిబట్టిమెటీరియల్ వాడతారు.దారంతోచేసిన హ్యాండ్ మేడ్ బొమ్మ లకి గిరాకీ బాగుంది అన్నారు.అపూర్వం ఆదర్శం దివ్య వృత్తి ప్రవృత్తి కదూ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎందుకోసమంటారు?

అమలిన గంగ