పోన్ రింగ్ అయ్యేటప్పటికి “హలో శాంభవి హియర్” అన్నాను
“మీరే కదా చీరల విడియో గ్రూపులో పెట్టింది” అవతలి గొంతు పలికింది
“అవును ” అన్నాను.
“సారీస్ అమ్ముతారా?” మళ్లీ అవతలి స్వరం
“లేదండి”…
చాల రకాల చీరలు గురించి అందులో చెప్పారు , బాగుందని, తెలియని వాళ్లకు తెలుస్తుందని పెట్టాను. ఇంతకీ మీ పేరూ ? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
నేను అడగడంలో నా ఉద్దేశ్యం రచయత్రిగా నా పేరు అందరికీ తెలిసుంటుంది అనే ఏదో భ్రమ.
నేను “స్వప్న ను మాది ట్వంటీ ఫిప్త్ ఫ్లోర్ ,ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ ఓనర్స్ వాట్స్ అప్ గ్రూపలో మీ రు పెట్టిన పోస్టింగ్ చూసి, మళ్ళీ తనే మీది టెన్త్ ఫ్లోర్ కదా ?…
“అదే మీరు పంపిన విడియో చూశాను. నా ఫ్రెండ్స్ కూడా పంపాను. వాళ్లు అందులో వున్న కొన్ని రకాల చీరలు కావాలని అడిగారు”.
“మీరు సేల్ చేస్తారేమో అని కాల్ చేసాను”.
“నేను బాగా నచ్చితే తప్ప వచ్చినవి
అన్నీ ఫార్వర్డ్ చెయ్యను నాకు
వెబ్ ను కూడా చెత్తతో నింపడం నాకు ఇష్టం వుండదు” అన్నాను ఆదర్శ వాదిలా…
మీరూ ఏదో పేపర్ కటింగ్ లు మీ ఫోటోతో వున్నవి విడియోలు
పెడతారుకదా!’ ఆనడంలో ఏదో వ్యంగ్యం ధ్వనించిందనిపించింది.
మళ్లీ తనే “అందరూ ఏదో పెడుతుంటారు
ఎన్నని చూస్తాం చెప్పండి?.
కొందరు గుడ్ మార్నింగ్ విడియోలు లేస్తూనే మెదలు…
పనీ పాట లేక….వాళ్ళ పిల్లలవి మనవలవి వరస వారిగా ఫోటోలు,
సినియర్ సిటిజెన్ లు వేరే గ్రూపు పెట్టుకోవచ్చగా?
ఒకళ్లు పాటలు పెడితే,మరొకరు గీసిన చిత్రాలు,మీరేమో సరేసరి
ఏకంగా రచనలు చదవమని…
వినడం,చూడడం అయినా పర్వాలేదు, చదవమంటే ఎవరు చదువుతారు? నాకైతే తెలుగే రాదు, తెలుగులో మాట్లాడడమే గగనం ఆంటీ” అంది స్వప్న.
‘తనమాటలు నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి.
నేను రాసేవి చుట్టుపక్కల అందరూ చదువుతారు అనుకునేదాన్నీ! ఎవరి లోకం వారిదే ఎవరి అభిరుచులు వాళ్ళవే
ఇది ఒక కనువిప్పు ‘
‘పొట్టకూటి చదువులలో అభిరుచుల పై ఆసక్తి లేదు’ కంప్యూటర్ యుగంలో కాసంత వున్నా…
కాసుల గలగలలో అన్నీ మేఘాడంబరాలే.