ప్రేమ — మాయ

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కవిత

కామేశ్వరి వాడ్రేవు

ప్రేమ ప్రేమ అంటారు……. దానికి ఒక పెద్ద పీఠ వేస్తారు…..
కానీ దాని అసలైన నిర్వచనం ఏమిటి….
నా దృష్టిలో అదొక అంతస్పందన మాత్రమే…. బాహ్యనిధి కాదు..
ప్రకృతిలో ప్రేమ కనిపించని దృశ్యం ఉందా.. సరైన దృష్టితో చూడాలి కాని
రెండు హృదయాలు ఇష్టపడటం ప్రేమ కాదు…. ఆకర్షణ…. అదొక రసాయనిక చర్య మాత్రమే….
దానికి వయసు,సమయం,సందర్భం తో పనిలేదు.,…
ఇష్టమైతే ఒకేసారి పొంగి వస్తుంది… కష్టమైతే విదిలించేస్తుంది…
ప్రేమ కుసుమ కోమలంగా ఉంటుంది ప్రేమికుడికి….. వజ్ర సమానంగా దర్శనం ఇస్తుంది భగ్న ప్రేమికుడికి…..
గమనిస్తే ప్రేమ ఎందులో లేదు….. సద్గుణాలన్నీ ప్రేమకు మారు పేర్లే…
ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు కనిపిస్తాయి… ప్రేమ కోసం యుద్ధాల కూడా జరిగాయి…..
వారికి తెలియదది ప్రకృతి కల్పించిన తాత్కాలిక స్పందనయేనని…..
నేను.. నాది… లోనే నిండి ఉంటుంది ప్రేమంత… ప్రేమలో కనిపించేది అంతర్లీన స్వార్ధము మాత్రమే…
జీవితపు దశలలో దాని నిర్వచనాలు మారుతూ ఉంటాయి…….. దాని చేష్టలు కూడా మారుతాయి….
ప్రేమ రంగులు మార్చే ఊసరవెల్లి …. దానికి నిశ్చలత లేదు….
ప్రేమలో గెలుపోటములు భ్రమలు…..
ఆత్మ విమర్శ చేసుకుంటే….. ప్రేమలో క్షణికావేశం జయం… అహం ప్రదర్శన అపజయం…..
దానిని అర్థం చేసుకోవడంలో….. ఆచరించడంలో….
ఒక జీవితకాలం సరిపోదేమో……

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వసంత పంచమి ( శ్రీ పంచమి)

బుజ్జిదూడ భయం