స్వయంకృషి.

కథ

ప్రేరణ. చిన్న చిన్న పిల్లలు చెత్త ఏరుకొని scrap shops లో అమ్మటం చూసా.పెద్ద పెద్దScrap godowns Musarambad దగ్గర చూసా.క‌రోనాలో అనాధ పిల్లపరిస్థితి విన్నా.దీపావళి కి టపాకాయలను ఏ‌‌రుకునే పసికందు లను చూసా . చిత్తూరు జిల్లా లో మావారు Indian Bank పని చేసారు.అక్కడి ప్రజల.మంచి తనం మాండలికం వ్యవహారాలు ప‌రిశీలించి వ్రాసినదే ఈకధ.మనిషిలో పట్టుదల,దానికితగ్గ ప్రయత్నం,నిరాశని తరిమిగొట్టి నీకు నేను ఉన్నాను అని వెన్నుథట్టేవాళ్శుంటే ఈ దేశంలో అనాధల ఆకలి ఆక్రందనలు ఉండవేమో!ఏమో!

 

దేవులపల్లి విజయలక్ష్మి

గోనెసంచి పక్కన పెట్టుకొని మువ్వన్నె జెండా గట్టుమీద తల ఆన్ఛి కూర్చున్నాడు ఈరిగాడు.
ఎదురుగా బోసినవ్వుల గాంధీ బొమ్మ చేతిలో కఱ్ఱతో. ఈదురుగాలి వీచినప్పుడు ఆ కఱ్ఱ ఊగుతూ ఏదో సందేశమిస్తున్నట్లుంటుంది.సాయంత్రం గూటికి చేరే పక్షులు గాంధీబొమ్మ తలమీదనో బుజాల మీదనో వాలి సేద తీర్చకుంటూ ఉంటాయి.ఈరిగాడికి ఆగాంధీ బొమ్మంటే ప్రాణం. ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది.

“ఈ బొమ్మలోలానే తాత ఉండేటోడు.”స్వగతంలో అనుకోబోయి బైటకన్నాడు. ఆలోచనలు తాత చుట్టూ పరిభ్రమించ సాగాయి.

“తాత ఎప్పుడు కామందు రాజన్న నాయుడింట్లో పేడకడలెత్తుతూ గొడ్లకి సేవ చేసేవాడు. ఈబొమ్మలో తాత లానే తన తాత కూడా చిన్నగోచీ కట్టుకుని తిరగేవాడు.అయితే తన తాత బొమ్మ ఎక్కడాలేదు.” అనుకున్నాడు ఈరిగాడు.

ఈయన బొమ్మ అక్కడెందుకుందో అన్న ఆలోచన రాని అమాయకుడు ఈరన్న. కారణం అది గాంధీ బొమ్మకాదు ఈరిగాడికి.తనకు ప్రాణబిక్ష పెట్టిన ఈ తాతలో తనతాత ఉన్నాడన్న గట్టి నమ్మకం.

సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ పిట్ట పాట

మన మహిళామణులు