భారతీయ శిల్పకళా చరిత్రలో స్త్రీ మూర్తుల

శిల్పకళలో ఉనికి చాటిన స్త్రీ  శక్తి శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమా శాస్త్రం  అంటారు. శిల్పం అంటే పోత పోసిన విగ్రహం. ఇవి కృష్ణశిలలతోనూ, పాలరాయితోను తయారు చేస్తారు. ముఖ్యంగా దేవతామూర్తులు, రాచ కుటుంబీకులు, గురువులు, జంతువులు వంటి వాటిని శిల్పాలుగా చెక్కుతారు. వీటిని  చెక్కే వారిని స్థపతి లేదా శిల్పి అంటారు. భారతీయ శిల్పకళలో విభిన్న ప్రాంతాలకు చెందిన కళారీతులు మనకు అగుపిస్తాయి.

రాతియుగంలో లిపి బొమ్మలను చెక్కడం ద్వారా ప్రారంభం అయింది. వారు దైనందిన జీవితంలో గమనించిన పలు విషయాలను ఇంటిలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.

భారతీయ శిల్పకళా చరిత్రలో తమ ఉనికిని చెక్కిన స్త్రీ మూర్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లీలా ముఖర్జీ(1916 – 2003):

శాంతినికేతన్ లో పెయింటర్ గా శిల్పిగా శిక్షణ పొందిన వీరు తమ గురువైన రామకింకర్ బైస్ యొక్క రచనలచే ప్రభావితమై నారు.  బెనోడు బిహారీ ముఖర్జీ అనే కళాకారుడి పరిచయం శిల్పకళలో మెలకువలను అతని ద్వారా తెలుసుకునీ , క్యాంపస్ లో అతను చిత్రించిన కుడ్య చిత్రాలలో తన వంతు సహాయసహకారాలందించారు. 1947లో మధ్యయుగ భారతీయ సై ఈట్స్ పై హిందీ భవనం వద్ద రూపొందించబడిన మారక గోడ పెయింట్ ను ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఈ పరిచయం కాస్త వివాహ బంధంగా   మారడంతో 1949లో నేపాల్ ప్రభుత్వం మ్యూజియం క్యూరేటర్ గా ఖాట్మండుకు వెళ్లిన భర్తతోపాటు తాను  వెళ్లి అక్కడ అతని స్నేహితుడైన ప్రముఖ నేపాలి శిల్పకారుడు కుల సుందర్ షిలాకర్ణి అనే కళాకారుడి వద్ద చెక్క మరియు రాతి శిల్పకళను అభ్యసించి అభ్యసించారు. చెక్కపై చెక్కడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచిన ఆమె పలు ఆదివాసి మానవ రూపాలను తన కళలో నిబిడీకృతం చేశారు.

లీలాముఖర్జీ భర్త బెనోడ్ బెహారీ ముఖర్జీతో

నేపాల్ రాజస్థాన్ లో కొంతకాలం బాధ్యతలు నిర్వహించి ముస్సూరీ కి వెళ్ళిన ఈ జంట అక్కడ కూడా పూర్తి సమయాన్ని కళామతల్లి సేవలో గడిపారు. లీలాముఖర్జీ ముసలోరిలో తమ భర్త పేరు మీదుగా బెనోడు విహారి చిత్రకళా శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు. ఆమె డెహ్రాడూన్ లోని వెల్హమ్ ప్రిపరేటరీ పాఠశాలలో అధ్యాపకురాలిగా బాధ్యతలు నిర్వహించారు. సారీ లో ఉన్న సమయంలోనే వీరు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి ఆ శిశువుకు మృణాళిని ముఖర్జీ అని నామకరణం చేశారు.

మృణాళిని ముఖర్జీ (1949 – 2015):

లీలా ముఖర్జీ వినోద్ బిహారీ ముఖర్జీల పుత్రిక అయిన వీరు జనపనార, అద్దకం ఉపయోగించి శిల్పకళలో తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు . నాలుగు పదుల ప్రస్థానంతో పలువురి మన్ననలు పొందారు.పిల్లో పోచ్ ఖనా వాలా(1923 – 1986)బొంబాయి నగరానికి చెందిన వీరు శిల్పకళను వ్యక్తీకరణ మాధ్యమంగా మలుచుకునే కంటే ముందు ప్రకటనల రంగంలో పనిచేశారు.

మృణాళిని ముఖర్జీ

1951లో యూరప్ పర్యటనలో భాగంగా హెండ్రీ మోర్ మరియు కాన్స్టాంటిన్ బ్రాంచ్ వంటి అగ్రశ్రేణి కళాకారుల ప్రేరణతో తమ కళా నైపుణ్యానికి  మెరుగులు దిద్దుతున్నారు ముంబైలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో ఈమె కళాఖండాలు ప్రదర్శింపబడినవి. వీరు తమ శిల్పాల గురించి వివరిస్తూఈ శిల్పాలకు సంబంధించిన విషయాలు చాలామందికి అర్థం కాలేదు అని కానీ తాను చెవిటి మూగ పిల్లలకుబోధించే సమయంలో ఒక విద్యార్థిని నాట్య భంగిమలో తాను మలిచిన శిల్పం ముందు నిలబడి తనకు తానుగా ఏ విధమైన తనకు తానుగా నృత్యం చేయడం తనను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసింది అని చెబుతారు ఒక కళాకారిణి గా మాత్రమే కాకుండా 1960   సంవత్సరం నుండిచాలా సంవత్సరాల పాటు బాంబే హార్ట్ ఫెస్టివల్ కు సమన్వయకర్తగా పనిచేశారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ను ముంబైలో స్థాపించడంలో ప్రధాన భూమిక పోషించారు. భారతదేశంలోని ప్రముఖసమకాలీన కళ మ్యూజియంలలో ఒకటిగా ఇప్పుడు ఇది వెలుగొందుతూ ఉంది.ఉషారాణి హూజా(1923 శిల్పకళలో ఉనికి చాటిన స్త్రీ  శక్తి శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమా శాస్త్రం  అంటారు. శిల్పం అంటే పోత పోసిన విగ్రహం. ఇవి కృష్ణశిలలతోనూ, పాలరాతి తోను తయారు చేస్తారు.

ముఖ్యంగా దేవతామూర్తులు, రాచ కుటుంబీకులు, గురువులు, జంతువులు వంటి వాటిని శిల్పాలుగా చెక్కుతారు. వీటిని  చెక్కే వారిని స్థపతి లేదా శిల్పి అంటారు.

పిల్లో పోచ్ ఖనావాలా(1923 – 1986):

బొంబాయి నగరానికి చెందిన వీరు శిల్పకళను వ్యక్తీకరణ మాధ్యమంగా మలుచుకునే కంటే ముందు ప్రకటనల రంగంలో పనిచేశారు. 1951లో యూరప్ పర్యటనలో భాగంగా హెండ్రీ మోర్ మరియు కాన్స్టాంటిన్  వంటి అగ్రశ్రేణి కళాకారుల ప్రేరణతో తమ కళా నైపుణ్యానికి  మెరుగులు దిద్దుకున్నారు.

ముంబైలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో వీరి కళాఖండాలు ప్రదర్శింపబడినవి.

                       పిల్లో పోచ్ ఖనావాలా

వీరు తమ శిల్పాల గురించి వివరిస్తూ , ఈ శిల్పాలకు సంబంధించిన విషయాలు చాలా మందికి అర్థం కాలేదని కానీ తాను చెవిటి, మూగ పిల్లలకు బోధించే సమయంలో ఒక విద్యార్థిని తాను మలిచిన శిల్పం ముందు నాట్య భంగిమలో నిలబడి తనకు తానుగా నృత్యం చేయడం తనను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతారు .

ఒక కళాకారిణిగా మాత్రమే కాకుండా 1960   సంవత్సరం నుండి చాలా సంవత్సరాల పాటు బాంబే ఆర్ట్ ఫెస్టివల్ కు సమన్వయకర్తగా పనిచేశారు.

నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను ముంబైలో స్థాపించడంలో ప్రధాన భూమిక పోషించారు. భారతదేశంలోని ప్రముఖ సమకాలీన కళా మ్యూజియంలలో ఒకటిగా ఇప్పుడు ఇది వెలుగొందుతూ ఉంది.

ఉషారాణి హూజా(1923 – 2013):

జన్మతః క్రైస్తవులైన వీరు జాయిస్ ఈటా ఉష జోసెఫ్ అనే పేరును తర్వాతి కాలంలో ఉషారాణిగా మార్చుకున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఒకానొక సందర్భంలో ఢిల్లీ పాలిటెక్నిక్స్ లోని ఆర్ట్స్ విద్యార్థులతో కలిసిన కారణంగా శిల్పాల వైపు ఆకర్షితులయ్యారు .

ఉషారాణి హూజా

లండన్ లోని జోసెఫ్ రీజెంట్ స్ట్రీట్ పాలిటెక్నిక్ లో శిల్పకళ పై అధ్యయనానికి గాను 1949లో ఇంగ్లాండ్ వెళ్లారు.అక్కడే రోడెన్ మరియు ఎప్ట్సీన్ వంటి నిపుణుల రచనలను అధ్యయనం చేశారు.

1955లో భారతదేశానికి తిరిగి వచ్చి , రాజస్థాన్ రాష్ట్రం లోని జైపూర్లో ఎక్కువ కాలం గడిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలలో భాగంగా 40 కి పైగా విగ్రహాలు మరియు బొమ్మలను చెక్కారు.వీరి అద్భుత కళాఖండాలను ఢిల్లీ , బిల్వారా, బొంబాయి ,జైపూర్, జోద్పూర్  లలో మాత్రమే కాకుండా స్వీడన్, వాషింగ్టన్ , ఫిలిప్పీన్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి.

 1963 లో జైపూర్ లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన త్రిమూర్తి సర్కిల్లోని పోలీస్ మెమోరియల్  ని వీరి  కళానైపుణ్యానికి  ఒక మచ్చు తునకగా భావించవచ్చు .

1975లో పంజా విసిరిన అనా రోగ్య సమస్య కూడా వీరి కళాతృష్ణను అడ్డుకోలేకపోయింది . ఆ సమయంలో వీరు వ్రాసిన కవితలు శిల్పాల ప్రచురణకు దారితీసి అవి కాస్తా కవిత్వం మరియు కళాకృతులు అనే సంకలనంగా వెలుగొందింది .

మీరా ముఖర్జీ(1923 – 1998):

భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాతి కాలంలో వెలుగులోకి వచ్చిన అత్యంత  ప్రతిభావంతులైన మహిళా శిల్పులలో మీరా ముఖర్జీ ఒకరు .శిల్పకళలో ప్రాథమిక పాఠాలను భారతదేశంలో అభ్యసించి , ఆ తర్వాత మ్యూనిచ్ లో సాంకేతిక శిక్షణను పొందారు .

మీరా ముఖర్జీ(1923 – 1998):

అనంతర కాలంలో భారతదేశానికి తిరిగి వచ్చిన వీరికి ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాభారత దేశంలోని లోహ, హస్త కళాకారులపై డాక్యుమెంట్ చేయడానికి నియమించింది .

జానపద కళలు చేతివృత్తులపై సాగిన ప్రయాణం  అనతి కాలంలోనే ఆమెను ఒక మంచి కళాకారిణిగా, శాస్త్రవేత్తగా రూపుదిద్దింది .

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బస్తర్ లో ధోక్రా శిల్పులచే ప్రభావితమై కాంస్యంలో తన ప్రత్యేకతకు సాంకేతికతను జోడించారు .

 డ్రాయింగ్, పెయింటింగ్ మరియు రైటింగ్ వంటి పలు ప్రక్రియలలో కూడా అద్భుతంగా రాణించారు .

భారతీయ కళలకు చేసిన విశిష్ట సేవకు గాను 1992లో పద్మశ్రీ తో పాటు పలు అవార్డులు వీరిని వరించాయి.

కనకమూర్తి(1943 – 2021) :

భారతదేశంలోని సాంప్రదాయ మహిళా శిల్పులలో ఒకరైన వీరు సైన్స్ లో పట్టభద్రురాలై , మైసూర్ లోని ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంపై  చెక్కిన రాతి శిల్పాలను చూసి , కళల వైపు ఆకర్షితురాలయ్యారు .ఆ అందమైన శిల్పాలను చూసేందుకు వీరు ప్రతిరోజు ఆ ప్రదేశాలను సందర్శిస్తూ ఉండేవారు.

కళలు, సంగీతం మరియు కవిత్వం పట్ల ఉన్న ప్రత్యేకమైన ఆసక్తి శిల్పకళను వృత్తిగా స్వీకరించడానికి కారణం అయింది.  

వీరి శిల్ప రచనలు ప్రధానంగా భారతీయ పురాణాల ఆధారంగానే కొనసాగినవి .

కనకమూర్తి

చాళుక్యులు, పురాతన యుగం లోని శిల్పకళారీతులతో ప్రేరణ పొందిన వీరు  తనదైన కొత్త శైలితో సరికొత్త కళా నైపుణ్యాన్ని సృష్టించారు .

మట్టి,రాయి,గాజు,ఫైబర్,బంకమట్టి వంటి పదార్థాలెన్నో వీరి కళాకృతులలో వినియోగించబడినవి .

జాసు శిల్పి(1947 – 2013):

భారతదేశంలోని కాంస్య మహిళగా ప్రసిద్ధి చెందారు. నాలుగు దశాబ్దాల  ప్రస్థానంలో 750 కి పైగా కాంస్య విగ్రహాలను రూపొందించారు .

 చిన్ననాటి నుండే లలిత కళల పట్ల ఆకర్షితురాలైన వీరు ఆహ్మ దాబాద్ లోని  షేక్ సి ఎన్ కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ లో చదువుకొన్నారు.అప్పుడు తరగతిలోని ఐదుగురు మహిళల్లో ఒకరిగా ఉండడం గమనించదగిన విషయం.వీరు శిల్పకళను ఎక్కువగా ఇష్టపడినప్పటికీ, దాని అనుబంధిత విభాగాలైన మరికొన్నిటిలో కూడా రాణించారు.

                  జాసు శిల్పి

ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద ,మహాత్మా గాంధీ వంటి ప్రముఖల విగ్రహాలను మలిచారు.

28 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ఒక మహిళ సృష్టించిన ఎత్తైన కాంస్య విగ్రహంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. దీనికిగాను పలు అవార్డులు ,ప్రపంచవ్యాప్త గుర్తింపు వీరి సొంతమైంది  .

వీరి పేరు మీదుగా స్థాపించబడిన జాసుబెన్  ఆర్ట్ ఫౌండేషన్అనే సంస్థ  వర్తమాన శిష్యులకు బాసటగా నిలుస్తోంది .

విభిన్న రంగాలలో ప్రదర్శితమవుతున్న మహిళా శక్తిని మనం గమనిస్తూనే ఉన్నాం . స్త్రీలు అత్యంత అరుదుగా కనిపించే రంగం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే నాకు శిల్పకళారంగం అని ఆలోచన కలిగింది.

 కాస్త వైవిధ్య భరితమైన అంశంపై వ్యాసం వ్రాయాలన్న ఆలోచనతో దీన్ని మీ ముందుకు  తెచ్చాను . మరో అంశంతో మళ్ళీ కలుద్దాం .

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాల భ్రమణం

పల్లవించు ప్రతి రాగమిది … Heartbeat of the country !!