కాల భ్రమణం

కవిత

దేవుపల్లి విజయలక్ష్మి

కాలమా ఓ కాలమా
కదలిపోకుమా!

కరడుగట్టిన ఎదనీది
కన్నీరెరుగదు
కానివారని ఆదరించక పో
కనికరమే లేదు అయిన వారని.

కాలమా ఓ కాలమా
కదలిపోకుమా!

కనులు లేవనీ కానరాదనీ
కంటికి గంతలున్నాయనీ
కుంటిసాకుల
కాలవాలమైన

కాలమా ఓ కాలమా
కదలిపోకుమా!

కాటేయటమే నీధ్యేయం
కరుణే లేదు కారణం
కనులువిప్పి
కంటితడి స్పర్శించు

కాలమా ఓకాలమా
కదలిపోకుమా!

కడగండ్లకోర్చి
కలల దరిచేరబోవ
కర్కశపునీ కోరల్లో జీవాత్మ అలమటించ

కాలమా ఓ కాలమా
కదలిపోకుమా!
కను‌రెప్పపాటు ఆలోచించు
వడి వడి అడుగులు ఆపి
కడవరకు ఆగుమా!

(ఎన్నోఅవాంఛనీయ సంఘటనలలో అశువులు బాసిన చిన్నారులు,యువత,పెద్దవారికి అశ్రునివాళి.)

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీతిశతకము

భారతీయ శిల్పకళా చరిత్రలో స్త్రీ మూర్తుల