విశ్వజనుల మేలు విద్యకు కూరిమి
జనుల మేలు వెలుగు జగమునకును
మంచి మేలు ధరన మంచిని కూర్చును
విశ్వ వినుత బాల వినుర లోక
పరులకు వ్యధ కలుగ పరుగున పోవను
అందరిలన వేల్పు చూడగాను
భేదభావము కలుగని భవిత గెలుపు
విశ్వ వినుత బాల వినుర లోక
బీద గొప్ప యనుచు భేదముల నణచు
సంఘ ఉన్నతి కను సంగతము యు
గొప్ప దైన నెరవు గొప్పది గనుచును
విశ్వ వినుత బాల వినుర లోక
మనది మనదని తలచిన ఏమి మిగులును
స్వార్థ తలపు ఎంతవరకు సాగు
తనదని అనుకున్న తనువే మిగులదుగా
విశ్వ వినుత బాల వినుర లోక
విద్య లేని మనిషి వింత పశువుగద
ప్రేమ లేని మనసు ప్రేతము వలె
నీళ్లు లేని పాదు నిల్చునా పెరుగునా
విశ్వ వినుత బాల వినుర లోక
దూషణములు దొసగు దుర్జనులకు ఇంపు
సుప్రియ వచనములు సుజను కెలవు
పరుష వాక్యములును పదును బాకులు గద
విశ్వ వినుత బాల వినుర లోక
కలత పడిన జనుల కలిమిని చేయుట
బాధిత బ్రతుకులకు బాట జూప
సమసమాజ ముగన సముచితము గదరా
విశ్వ వినుత బాల వినుర లోక
పరుల సొమ్ము పామువంటిది తెలుసుకో
తనకు యున్న విలువ తనకు యుండు
అక్ర మమగు సొమ్ము వాడుట మంచిదా
విశ్వ వినుత బాల వినుర లోక
పనికి రాని చదువు పరమ వ్యర్థము గద
ఘనమగు గురిని గని దాన్ని చేరు
గెలుపు లేని విజయ గీతము ఎందుకు
విశ్వ వినుత బాల వినుర లోక
పనికి రాని చదువు పరమ వ్యర్థము గద
గొప్పదైన ధ్యేయమును సాధించు
గెలుపు లేని విజయ గీతము ఎందుకు
విశ్వ వినుత బాల వినుర లోక
విద్య వల్ల మంచి వినయము వచ్చును
వినయమున కలంకరణ సుగుణము
మంచితనము మరువ మార్పు జేయును గద
విశ్వ వినుత బాల వినుర లోక