అంటీముట్టని బంధాలు
స్పందించని హృదయాలు
కొడివడుతున్న విలువలు
మనసులో విషభాండాలు
పెదవులపై మధుర దరహాసాలు
పంచదార పలుకులతో పలకరింపులు
ఇంటి పెద్దలతో, కుటుంబ సభ్యులతో
నేను, నాది అన్న స్వార్ధపూరిత పద ప్రయోగాలతో సంభాషణలు
సొంతవారిని కూడా దూరం పెడుతున్న వైనాలు
క్షణం తీరికలేని ఉద్యోగాలని దీనికి సాకులు
ఇది మనిషికి డబ్బు ఇచ్చిన స్వాతంత్ర్యమా?
లేక ఆ మనిషి నైజమా?
ఏది ఏమైనప్పటికీ మనుషుల (మనసుల ) మధ్య
ఏర్పడుతున్న అగాధాలు
విచ్చినమౌను ప్రేమానుబంధాలు
ప్రేమానుబంధాలాకై పరితపించే మనుషులు
నేటి సమాజంలో పనికిరాని పిచ్చోళ్ళు.