మేలిముత్యం

కవిత

కవన సంద్రంలో రాలుతున్న అక్షర స్వాతి బిందువులను
ఒడిసిపడుతున్నారు కవులు తమ మనసు ఆల్చిప్పల్లో
ముత్యాల్లా మారిన భావాలను ఏర్చి కూర్చి
అల్లుతున్నారు కవన ముత్యాల హారాలు
ప్రతీ కవన హారం కావాలి మనిషిలో సుగుణాలను
పెంపొందించే ఆభరణం
దానితో వెలుగొందాలి మనిషి సమాజంలో
మేలిముత్యంలా.

పాముల జ్యోతిర్మయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఖండగతి

అంతర్ముఖం