ఖండగతి

గజల్

నా కిపుడు లోకమే శూన్యమై పోయింది
మమతెక్కడో దాగి మాయమై పోయింది

మునిగేటి నావకే దిక్సూచివనుకుంటి
హృదయమే తూఫాను తీరమై పోయింది

హృది స్పందనలు పేని ప్రేమలో తడిపాను
సుడిగాలిలో వెలుగు దీపమై పోయింది

కారుణ్య పుష్పాలు కసికసిగ నలిపేరు
నమ్మకపు విరితోట నాశమై పోయింది

అవమాన భారాలు ఓర్చావు కద ఉమా!
ఆత్మయే చితిలోని దేహమై పోయింది!

ఎం. వి. ఉమాదేవి.

Written by Mv Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పూలజడ

మేలిముత్యం