పూలజడ

నీలాల నింగిలో నక్షత్ర కాంతి వలె నల్లని జడలో మల్లెల సోయగం

చుక్కల పల్లకిలో శశాంకుని వ్యాహ్యాళికి మల్లె

నిండైన కేశసంపదకు మెండైన శోభ

విరిదండలలో ఒదిగిన వేణి మరువపు గంథాన్ని సైతం అలదుకొని

సమీరాలకు సుగంధాలద్ధి మనసులను రంజింప చేస్తుంది

దారంతో జతగూడి మల్లెలు మంతనాలాడుకుంటున్నాయి

పందిరి నల్లుకున్న పూతీవెల వలె కేశపాశంతో విరిదండలు ఊసులాడుకుంటున్నాయి

కురుల నిగనిగలకు తోడైన విరుల గుభాళింపులు మెడలోని పుత్తడి జిలుగులకు దీటైన పోటీనిస్తున్నాయి

నీలి కురులకు మల్లెతీగకు కుదిరిన చెలిమి పూలజడగా ప్రత్యేక అలంకరణై సాంప్రదాయాన్ని సుసంపన్నం చేస్తోంది

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

ఖండగతి