తెలుగు సాహిత్య రంగంలో వినూత్న ప్రక్రియ తో తాను రచనలు చేయడమే కాకుండా తోటి రచయితల ను భాగస్వామ్యం చేస్తూ ఐక్యంగా సాహిత్య సేవ చేస్తున్నారు ప్రముఖ రచయిత ఘాలి లలిత ప్రవల్లిక గారు. సైన్స్ ఫిక్షన్ నవల తో పిల్లలను ఆకట్టుకుని రేపటి తరం పుస్తకాలతో దోస్తీ చేసేలా ప్రోత్సాహిస్తున్నారు. ఈ వారం తరుణి ముఖాముఖి ఘాలి లలిత ప్రవల్లిక గారితో…
తరుణి: మీ పరిచయం?
ఘాలి లలిత ప్రవల్లిక: హాయ్…హలో… నమస్తే నేను మీ ఘాలి లలిత ప్రవల్లిక ను. సాహితీ సేవకురాలను.
తరుణి: సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది?
ఘాలి లలిత ప్రవల్లిక:
చిన్నతనంలో విస్తృతంగా బుక్స్ చదివేదాన్ని. బహుశా ఆ ప్రభావమో! లేక నాన్నగారు చిన్న చిన్న స్కిట్స్ రాసి పిల్లలతో వేయిస్తూ ఉండేవారు. దానివల్ల నో సాహిత్యం పై ఆసక్తి కలిగింది.
తరుణి: ఇప్పటివరకు మీరు రాసిన ప్రక్రియ లు?
ఘాలి లలిత ప్రవల్లిక;
రాయండి, ప్రయోగాలు చేయడం ఇష్టం. దాంతో సాహిత్యం లో చాలా ప్రక్రియ లు రాశాను. కథలు, నవలలు, కార్డు కథలు, నానోలు, గల్పికలు, నాటికలు , కవితలు, పద్యాలు, గజల్స్, గేయాలు, నానీలు, బుర్ర కథలు, బాలసాహిత్యం , వ్యాసాలు ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేశాను.
తరుణి: ప్రచురించిన పుస్తకాలు?
ఘాలి లలిత ప్రవల్లిక: ఇప్పటివరకు నాలుగు పుస్తకాలు వచ్చాయి.
1.మట్టి పాదాలు ( కవితా సంపుటి)
2. ఆహా కథాకుసుమాలు (కథల సంపుటి)
3. మర్మ దేశం(సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల)
4. వీరభద్ర గుట్ట (గొలుసు కట్టు నవల. నా నిర్వహణ, సంపాదకత్వం లో)
తరుణి : మీరు అందుకున్న అవార్డులు?పొందిన పురస్కారాలు / బిరుదులు:
ఘాలి లలిత ప్రవల్లిక: చాలా నే ఉన్నాయి.
1.జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు
2.గురజాడఅప్పారావుఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి రాష్టీయ పురస్కారము
3.సావిత్రిబాయి పూలే ఆదర్శ ఉపాద్యాయిని పురస్కారం
4.ఆదర్శ మహిళా పురస్కారం
5.పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం
6.గుర్రాల రమణమ్మా సాహితీపురస్కారం
7.గుఱ్ఱం జాషువా పురస్కారం
8.సత్యశ్రీ పురస్కారం
9.గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం
10.సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం
11.విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం
12.అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్య స్రష్టపురస్కారం
13. తానా వారి నుంచి 10,000 నగదు , సత్కారం.
14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు
15. ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’బిరుదు
16. తెలుగు కవితా వైభవం హైద్రాబాదు వారినుంచి
సహస్రకవి మిత్ర
తరుణి: మీరు ప్రస్తుతం రాస్తున్న పుస్తకాలు?
ఘాలి లలిత ప్రవల్లిక:
1. కొలిమి నవల (సిరి మల్లెలు కాలిఫోర్నియా వారి ఆన్లైన్ పత్రికలో ధారావాహికగా వస్తోంది)
2. మిన్నాగు నవల
3. త్రేతాగ్ని నవల
ఇంకా రెండు నవలలు, కథలు, కవితలు
నేను రాయిస్తున్న గొలుసు కట్టు నవలలు
4. శ్వేత ధామం 32 మంది చే రాయించిన గొలుసు కట్టు నవల పూర్తయింది.
5. 108 మంది చేత రాయిస్తున్న మాయా లోకం గొలుసు కట్టు నవల తపస్వి మనోహరం ఆన్లైన్ పత్రికలో సీరియల్ గా వస్తోంది.(కొనసాగుతోంది)
ఎన్ హెచ్ ఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లో కూడా వస్తోంది.
6. నల్ల హంస బాల బాలికలు
రాస్తున్న గొలుసు కట్టు నవల (కొనసాగుతోంది)
తరుణి : భవిష్యత్తు రచనలు?
ఘాలి లలిత ప్రవల్లిక:
బాలల నవల, సస్పెన్స్ థ్రిల్లర్ నవల, కథలు, కవితలు, నాటికలు, గజల్స్ రాస్తున్నా ను.
బాలబాలికల చేత ఎక్కువగా రచనలు చేయించడమే లక్ష్యం గా పనిచేస్తున్నాను.