వంట కుపక్రమించ బోతూ , ముందుగా పుల్కా చేద్దామని చెక్క పీటని కిచెన్డ్రాయర్ లోంచి లాగ బోయారు ఆమె.
కిరణ్ గభాల్న. అడ్డం వచ్చాడు. “అమ్మా , వేరేది తీసుకుందాం. దాని పై చేయకు!”
అన్నాడు గాభరాగా. ఆమె ఆశ్చర్యంగా ‘అదేంటి? ” అన్నారు. పట్టుబడిన. దొంగలావుంది కిరణ్ పరిస్థితి. అప్పటికేదో చెప్పి
మానేజ్ చేశాడు. కొడుక్కి పెళ్ళి చేసిన కొన్నాళ్ళకు మొదటి సారి ఫిలడెల్ఫియా వచ్చారామె . భర్తవెంట.
ఆవిడకు ఒక్కో విషయమే అర్ధమవసాగింది. కోడలు సరిగా లేదు. ఎందుకిలా అని కిరణ్ ని తరిచి ప్రశ్నించారావిడ కిరణ్
ఇంక దాచుకోలేక. పోయాడు. కళ్ళ లో నీళ్ళు నిలిచి వుండగా గాద్గదిక కంఠం
తో తల్లి కి వివరించాడు.
తన వంట తాను చేసుకుంటుంది తన సామాన్లు తనవి. తన. జీతం డబ్బులు తన అకౌంట్ లోనే వుండాలి. ఏ పరిస్థితులు
వచ్చినా , జాబ్ వున్నా , పోయినా తన. డబ్బు ఇంటి కి వాడదు.తన జాబ్ , తన Careerతరువాతే ఏవయినా! నీ ఆఫీస్
కోసంఅంత ముందే లేచి వండే అవసరము నాకులేదు. నీ వంట. నువ్వు చేసుకో
అని చెప్పిందట. తానుముందు ఆఫీస్ కివెళ్ళేది వున్నా. పొద్దున్నే అవన్నీ నాకు కుదరవు. అంటుందంట. అంతే కానీ
ఇద్దరికీ కలిపి చేస్తాను అనదట. వీలైనప్పుడు తానేఇద్దరికీ చేస్తే “నో. థాంక్స్. మీ వంట నాకు నచ్చలేదని చెప్పిందట. ఆడవాళ్ళే వంట. ఎందుకు చేయాలి?
సంపాదిస్తూ కూడా వంట. చేసి పెడ్తూ బానిస బతుకు బ్రతకాలా ! అంటుందట.
తనబట్టలు తాను మిషన్ లో వేసు కోవాలి.
తాను వండుకున్నవి తానే తోముకోవాలి.
భార్య చేతి నుండి ఓ కప్పు కాఫీ కూడా ఆప్యాయంగా అందుకునే రాత లేదు. అసలు నాకంటె
Salary తక్కువ నీకు. నా హైట్ కు సరిపడిన వాళ్ళు దొరక్క నిన్నుచేసుకో వాల్సి వచ్చింది, అంటుందట.. ఆవిడ చేష్టలు డిగినదానిలా కూర్చుండి పోయారు. కొడుకు అందమైన కాపురం అనే కల. కరిగి పోయిన బాధతో.
“ఎందుకురా! ఇలా” అన్నారవిడ , ధారగా కారే కన్నీరుతో. “చూసావా! వద్దంటే అన్నీ అడిగావు. ఛ! నిన్ను బాధ
పెట్టిన వాణ్ణి అయ్యాను. అదేదో ఇజం అని చెప్తుంది లే.వాళ్ళతో పెట్టుకోక
పోవడమే ఉత్తమం” వాతావరణాన్ని తేలికచేస్తూ నవ్వించాలని కిరణ్ ప్రయత్నం అర్ధం అయి జాలిగా చూసిందామె కొడుకువంక..
ఇదిమారాలి ! ఈ సంసారం సహజీవనం లాఎలా చేయాలి ? ఇదే ఆలోచన వదలట్లేదు ఆమె ను.