మన మహిళామణులు

డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి

 వైద్య సాహిత్య సేద్యం లో రాణిస్తున్నారు ఆప్రతిభామూర్తి. ఆమెయే డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అందరికీ స్ఫూర్తి దాత. రెండు భిన్నరంగాల్లో రాణిస్తూ సంఘసేవ చేస్తున్న ఆమెని గూర్చి క్లుప్తంగా విహంగావలోకనం చేస్తాను.ఆమెకు లభించిన పురస్కారాలు అవార్డులలో కొన్ని మాత్రమే ప్రస్తావిస్తాను.ఎందుకంటే ఆమె నిగూర్చి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ బుక్ అవార్డు శిఖామణి సాహితీపురస్కారం ఆవంత్సలిటరరీ అవార్డు ఇలా ఎన్నో ఎన్నెన్నో.ఇక ఒక డాక్టర్ గా ఆమె సేవలు మాటల్లో వివరించడం కష్టం
2రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ గా పేదకాన్సర్ హెచ్.ఐ.వి.రోగులకు ఉచితరక్తదాన మిచ్చే ఏర్పాటు చేశారు.రెడ్ క్రాస్ తరుఫున వికలాంగుల బాలలరెసిడెన్షియల్ స్కూల్ వృద్ధాశ్రమం ఉచిత గైనిక్ వైద్య సేవలు అందించి సుర్జిత్ సింగ్ బర్నాలాఅవార్డ్ పొందారు.మహర్షి సాంబమూర్తి సామాజిక అభివృద్ది అధ్యయనాల సంస్థ అధ్యక్షులు గా ఆమె అందరిప్రశంసలు పొందారు.కాకినాడ చుట్టు ప్రక్కల గ్రామాల ఏజెన్సీ కోనసీమ మొదలైన ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన సభలు ప్రోగ్రాంలలో20వేలమంది బాలికలు పాల్గొనటం విశేషం.గర్భవతులకు సీమంతం వేడుకలు ఇంకా వారి కి సలహాలు వైద్యం తోఅధికారుల పౌరుల ప్రశంసలు పొందారు.


3 ఎ_గ్రేడ్ పొందటం విశేషం.ఉచితమొర్రి ఆపరేషన్ క్యాంపులు కంటి ఆపరేషన్లు దంతపరీక్షల క్యాంపులు
అసంఖ్యాకంగా కాకినాడలో 14ప్రాంతాల్లో ఒకేరోజు నిర్వహించారు.రోటరీ ఆశ్రయ మహిళల వృద్ధాశ్రమం
ఏర్పాటు చేశారు.వృత్తివిద్యాశిక్షణ కేంద్రాలు నెలకొల్పి 1500 మంది బాలికలు వనితలకు స్వయం ఉపాధి సామర్థ్యం కల్గించారు. మహిళలపై హింసను ఆపండి మహిళా సాధికారత ప్రభుత్వ పథకాలు
గ్యాస్ పై హక్కు మాదే అనే అంశాలపై ర్యాలీలు నిర్వహించారు.2004లోప్రపంచబ్యాంకు ప్రాజెక్ట్ కింద
మహిళల పోషకాహారం పరిశుభ్రత ఆరోగ్యం పైసామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన కుగ్రామంలో
ఆడవారికి శిక్షణ ఇవ్వడం జరిగింది.
4 ఇంకా సాహితీ వేత్త గా శ్రీ శ్రీ సప్తతి మహోత్సవం పాలగుమ్మి పద్మరాజు గారు ఇంకా సాహితీ వేత్తల శతజయంతి సభలనిర్వహణ చాసో రాచకొండ మొదలైన వారిసాహిత్యంపై సెమినార్స్ బడి కాలేజీ పిల్లలకు పోటీలు బహుమతులు గా సాహితీ వేత్తలు పుస్తకాలు ఇవ్వడం జరిగింది.పుస్తకావిష్కరణలు విజయవాడ విశాఖపట్నం రేడియో లో కథలు చర్చలు దూరదర్శన్ లో కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు.అనేక టి.వీ.ఛానల్స్ లోహెల్త్ టాక్స్ ఇచ్చి ప్రజాదరణ పొందారు.చైతన్యవనితామండలి ప్రెసిడెంట్ గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ అధ్యక్షులు గా సేవలు అందించారు.
5 ఆమె కథలు ఆంగ్లంలోకి అనువదింపబడినాయి.ఆమె రచనలపై ఎం.ఫిల్.చేశారు కొందరు.తానా సభలో పాల్గొన్నారు.కౌమారబాలికల ఆరోగ్యం అనే పుస్తకం అన్ని బడులు కాలేజీలకు ఇవ్వడం జరిగింది.విశాఖరచయితలసంఘం ఇంకా అనేక సాహిత్య సభల్లో రచయిత్రి గా గుర్తింపు పొందారు.హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ఆమె అనువాదాలు ప్రచురించారు.ఆనాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లో ఈమెరాసిన వ్యాసం “మహిళలు సినిమాలు బెంగుళూరు యూనివర్సిటీ పీయుసి టెక్స్ట్ పుస్తకం లో పాఠంగా వచ్చింది.” డాక్టర్ రచయిత ఐతే” అనే వ్యాసం హైదరాబాద్ ఓపెన్ యూనివర్సిటీ బి.ఎ.టెక్ట్స్ బుక్ లో చేర్చారు.
కృష్ణాజిల్లా ఆత్కూర్ లో పుట్టిన ఈమె విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ లో చదివారు.స్పోర్ట్స్ ఛాంపియన్ గా రాణించారు.గైనిక్ లోఎం.ఎస్.పాట్నా యూనివర్సిటీ లో చేసి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు.విజయలక్ష్మి నర్సింగ్ హోం లో ఉచితసేవలు అందించారు.యువవైద్యులకు మార్గదర్శి గా ఉన్న ఈమె జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకోవాలని తరుణి ఆశిస్తూ సెలవు తీసుకుంది.
ఈమె ఫోన్ 9849022441

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంక్రాంతి

సంధి అంటే?