రోజు సాయంత్రం వాకింగ్ కోసం రైల్వే స్టేషన్ వరకు వెళ్తాను. స్టేషన్ అరుగు పై కూర్చొని, వచ్చి పోయే వాళ్లను చూస్తుంటా….
వాకింగ్ చేసే సమయంలో కూడ ఎప్పుడు అటు వైపు చూస్తుంటా…
అలాగే చూశాను ఈ రోజుకూడ.
అక్కడ అరుగు పై ఓ ముసలాయన కూర్చున్నాడు. ఆ వ్యక్తి అచ్చం మా నాన్నలాగే కనిపించాడు. మా నాన్నేమో!
అనుకోని పరుగెత్తుకొని వెళ్యా. ..
నిజంగా నాన్న..
నే …ఆశ్చర్యపోయా….!
నాన్న! నువ్వు ఏంటీ ఇక్కడ? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఏందుకొచ్చావు…? ఇక్కడికి …
అంటూ ప్రశ్నల వర్షం కురిపించా….
“నాన్న నన్ను చూడగానే” కంట్లో నుండి కన్నీటి చుక్కలు ఎరులై పారుతూన్నాయి …..
నాన్న! నీ కంట నీరా……
పొంగివస్తున్నాదుఃఖాన్ని అపుకున్నా….
నాన్న కంట పడకుండా.. నాలో నేనే ఓదార్చుకున్నా.
“అమ్మా” ఏం చెప్పను…
ఇంట్లో రోజు మీ అన్న వదిన గొడవపడుతుంటారు…..
ఒక్కోసారి గొడవ మరి పెద్దాయి కొట్టుకునేవరకు వస్తాది…
ఎవరికి న్యాయం చెప్పాలో? …. చెప్పకూడదో? తెలియక నోర్మూసుకొని బతికివున్న శవంలా వాళ్ళిద్దర్ని చూస్తూ
కూర్చుంటా….
మీ వదినకు నేను భారం అంటూ ..
నా కోసం వంట వండడం ఇబ్భందంటా….
నేను భారం కారాదు…. అని నిర్ణయించుకున్నా……..
ఈ రైల్వే స్టేషన్ లో అడుక్కు తిని, బతుకటం మంచిదనిపించి ఇక్కడికి వచ్చా…
ఇక్కడ నన్ను ఆదరించే వాళ్లు చాలా మంది ఉన్నారు. నేను వచ్చి కూర్చోన్న క్షణంలోనే ఓ అమ్మాయి అలా వెళ్తుండగా నన్ను చూసి తాత చలికి వణుకుతూన్నావు అని తన వొంటి పైన వున్నా శాలువ తీసి నాకు కప్పిoది. వద్దుమ్మా, వద్దుమ్మా అంటున్నా వినకుండా.
అమ్మ నాకు ఇక్కడే బాగుంది. నా గురించి ఇక్కడ ఏవ్వరు గొడవ పడరూ? హాయిగా వుండోచ్చు ..
అంటూ పొంగి వస్తున్నా ఏడుపును అపుకొని, కూతురు కంట పడ్డోదు….. అన్నట్టుగా
కళ్లు తుడుచూకొన్నాడు……
నాన్న ఆగు నేను అన్న తో మాట్లాడుతా……!
నాన్న వద్దన్నా? వినకుండా అన్నకు ఫోన్ చేశా.
అన్న ఫోన్ లో వొరేయి నాన్న కనిపించటం లేదురా?..
పొద్దున నాకు వదినకు చిన్న గొడవ రా దానికి నాన్న మనస్సు కలతచెంది వుంటుందెమో!
నాన్న మనస్సు నొప్పించము రా ఆ బాధతో నాన్న ఇల్లు విడిచి పోయాడేమో!
పొద్దునుంచి పచ్చి గంజి నీళ్ళు కూడా నోట్లో పోసుకోకుండా నాన్న కోసం వెతుకుతున్నాo నేను మీ వదిన.
నీకు యెన్ని సార్లు పోన్ చేశానో ఆ పోన్ కావరేజి లో లేదు అంటుంది. ఇప్పుడే నీ దగ్గరికి వద్దామని బండి తీస్తున్నా ఇంతలో నీ ఫోన్ రా….. అన్న భాదను ఎకరువు పెట్టాడు.
నాన్న ఇక్కడ వున్నాడు అన్నాను. వెంటనే అన్న ఎ క్కడ రా నీ దగ్గరనా హమ్మ ఫర్వాలేదు రా! భయపడ్డా? అన్నాడు.
నా దగ్గర కాదు! రైల్వే స్టేషన్ లో…..
ఆ మాటకు అన్న షాక్ కయ్యాడు.? ఏంటీ రైల్వే స్టేషన్ లోనా! అక్కడికి యేలా వెళ్ళాడు. అగు,అగు నే వస్తున్నా అంటూ అఘామేఘాల పైన పరెగెత్తుకొని ఇద్దరు వచ్చారు.
వాళ్ళను చూసి! నాన్న నేను ఎక్కడికి రాను.? అని మొండికేసుకొని కూర్చున్నాడు. ఇంక నాకు ఓపిక లేదురా. నన్నొదిలేయ్యండి అంటూ చిన్నపిల్లాడి లా మరాం చేస్తున్నాడు…..
నేను నాన్నకు నచ్చజెప్పటం మెదలెట్టా. మేము వుండగా నువ్వు ఇక్కడ వుండటం … మా….. నాన్న మా ఇంటికి రా, నేను ప్రేమ గా పిలిచే సరికి. నాన్న కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు….
అమ్మా నేను వస్తే రేపు అల్లుడు కూడ నిన్ను…. వద్దమ్మా ..
నాన్న! నిన్ను ఒంటరిగా ఇక్కడ రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్ళమంటావా? అన్నాను.
నేను మీ ఇంటికి రావడం, మళ్లీ మీ ఇంట్లో గొడవలు
అవసరమా…..!
ముసలి వాణ్ణి, వయస్సు పైబడిన వాన్ని, ఏదో మూలన కూర్చోని కాలం గడుపుతూ…..
చావు కోసం ఎదురు చేసేవాడిని…. మీ కుటుంబలలో…. నా వల్ల గొడవలు రావటం నాకు ఇష్టం లేద్దుమ్మా….. అన్నాడు ..
ఇంతలో…. అన్నా వదిన ఏడుస్తూ……..
మామయ్య..
“గొడవకు కారణం మీరు అనుకుంటున్నారా”.
అయ్యో!… మామయ్యా! అసలు మీరు సమస్యనే కారు మాకు.
మిమ్మల్ని కోపగించుకోలేదు. మీరు లేకుండ ఇంట్లో ఓ నిమిషం కూడ వుండలేము అన్నాది వదిన.
మామయ్యా! పదా నీ మనుమడు అక్కడ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు అంది వదిన.
మనుమడు పేరు వినగానే నాన్న మనస్సు ఇంటివైపు లాగటం మొదలైంది…
నాన్న తన వెంట తెచ్చుకున్న సంచి సర్ధుకున్నాడు.
“అన్నవదినలకు ఓ కడిషన్ పెట్టాను”. మీరు యెప్పుడు గొడవ పడరాదు. మీరు సంతోషంగా సంసారం చేసుకోవాలి. మీ ఇంట్లో ఓ చిన్న పిల్లాడు వున్నడన్న సంగతి మరిచిపోరాదు. మీరు కనుక గొడవ పడితే ఈ పిల్లాడు అలిగి మళ్ళీ రైల్వే స్టేషన్ కు వచ్చి కూర్చుంటాడు. అన్నాను.
నాన్న అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు అన్న.
మామయ్య మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంది వదిన.