చిన్న పిల్లల్లో సృజనాత్మకత కు శ్రీకారం చుడుతున్న సౌజన్య

మన మహిళామణులు

సౌజన్య

శ్రీమతి సౌజన్య. Kidzee play school founder. వరంగల్ లో జన్మించారు. కాకతీయ యూనివర్సిటీ లో Mfil పూర్తి చేశారు. ఇంట్లో ఆమ్మా, నాన్న ఇద్దరూ టీచర్లు. అందుకే ఆమెకు టీచింగ్ అంటే ఇష్టం. పెళ్ళి అయిన తర్వాత తన కొడుకును స్కూల్లో చేర్పించడం కోసం ఎన్నో స్కూల్స్ తిరిగారు. ఆ సమయంలోనే తనకి స్కూల్ ప్రారంభించాలి అన్న ఆలోచన కలిగింది. అలా 2006 లో ప్లే స్కూల్ స్టార్ట్ చేశారు. స్కూల్ ప్రారంభించిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఒక్క పాప అడ్మిషన్ రావటమే గగన మైంది. చిన్నగా ఒక్కరితో ప్రారంభమైన ప్లే స్కూల్ mouth పబ్లిసిటీ ద్వారా ఎంతో మందికి చేరువైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలకి మంచి విద్య ఎలా అందివ్వాలి, వారిని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఏం నేర్పించాలి అన్నది తెలుసు కున్నారు. సక్సెస్ అయ్యారు. సమాజానికి. మంచి పౌరులను అందించాలన్న తన లక్ష్యం, పట్టుదల 5 స్కూల్స్ నడిపే విధంగా చేశాయి.18 సంవత్సరాల నుండి తాను పడ్డ కష్టం, ఇబ్బందులు తన ధైర్యం ముందు చిన్నబోయాయి. తాను ఇన్నాళ్లు పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చింది. 2009 లో సౌత్ లో బెస్ట్ స్కూల్ అవార్డ్, 2011 లో బెస్ట్ అప్రిసియేషన్ అంతేకాక పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో అవార్డులు వరించాయి.

భర్త, పిల్లల ప్రోత్సాహంతో పాటు, తన దగ్గర పని చేసే టీచర్లు, ఆయమ్మలు, బస్సు డ్రైవర్లు సహకారంతో 18 సంవత్సరాల నుండి సమాజానికి మంచి పౌరులను అందిస్తున్నారు సౌజన్య గారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కృషి పట్టుదలతో ఏ రంగంలో అయినా విజయం సాధించ వచ్చు అని నిరూపిస్తున్న సౌజన్య గారు ఎంతో మంది మహిళలకు ఆదర్శం, స్ఫూర్తి దాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అన్నమాచార్య కీర్తన

 నాన్నమనస్సు