నీ స్నేహంలో

కవిత

ఎలా తెలపను? ఎలా తెలపను? మది భావాలను ఉత్తుంగ తరంగ నాదాలను/ మూగబోయిన నా గొంతు నుండి మాటలు రాకున్నవి

ఓనమాలైనా దిద్దని నేను అక్షరాలతో పదాలు ఎలా కూ ర్చి కవిత రాయను

ఎగిరి వచ్చి నీ ముందు వాలడానికి నే పక్షి నైనా కాకపోతిని

కోయిలనై నీ ఇంటి చెట్టుపై వాలి పిలవలేకున్నానే..

ఆనందమంతా జల్లుగా కురిపించడానికి మేఘమయినా కాకపోతినే

ఏలారాగలను ?నా మది నిలిచిన నేస్తమా…
నిన్నెలా చూ డగలను?

మధుర జ్ఞాపకాలను ముడివేసి మనసున మూటకట్టి మనసునే పయనమై పొమ్మననా?

ఓ.. స్నేహామృతమా!
అమృత హృదయమా…
మరల మరల తలపులు నిన్నే తలుస్తూ ఉంటే..
మాట వినని మనసు పరుగులు తీస్తుంటే ..
ఏం చేయను?ఎలా ఉండను?

నా మదిలో నీ స్థానంపది లమేనోయి!
నివైనా రావా!?
స్నేహమధువును అందించవా!
ఈ జన్మకు ప్రాణం పోయావా?
నన్ను చిరంజీవిని చేయవా!?

జి. సులోచన

Written by G. Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆంగ్ల నూతన సంవత్సరం 2024

అన్నమాచార్య కీర్తన