మునుపొద్దు వేళ ముసుగు తీసి చూసేసరికి……
జారిపోయింది 2023…….
2024 వచ్చి ఒళ్లోన వాలింది……
చూచి దిగ్బ్రాంతి చెందాను….
అప్పుడే వెళ్ళిపోయిందా నా నిన్నటి నేస్తం అని
ఒక్కసారి వెనుకకు తిరిగి చూచా…..
మెదిలాయి మదిలోన జ్ఞాపకాలు….సముద్రపు అలల వలె…
ఒక కెరటం కష్టం తెచ్చింది… మరొకటి ఆనందాల వెల్లువ
కొన్ని అలలు దెబ్బలు కొట్టాయి., కొన్ని అలలు ప్రేమతో తనలో ఇముడుచుకున్నాయి
ఈ ఊపులో…. ఎన్ని అనుభవాలు గడించానో
ఎన్ని పాఠాలు నేర్చానో……
ఇక దిగులెందుకు…..మనసు సుస్థిరమైనతరువాత…. గత సంవత్సరం వెళ్ళిపోతూ…. నన్ను ఎదిగేలా చేసింది…..
ఈ నూతన సంవత్సరం దాటడానికి నింపింది నాలోన స్థితప్రజ్ఞత….
కష్టసుఖాలను కావడికుండల వలె మోయగలను….
అలల నిండిన ఆ సముద్రాన్ని ( సంసారం) దాటడానికి
స్థితప్రజ్ఞత అనే నావ నాలోనే ఉండనే ఉంది.
భయమెందుకు ఇక…. సాగిపోతా…ముందుకు… భవిష్యత్తు అనే పూలబాటలో నడవడానికి
***********