( డాక్టర్ మాదిరెడ్డి అండమ్మ మేడమ్ నల్లగొండ జిల్లా లో ఉపయోగించే పొడుపు కథలను సేకరించారు. ఇవి రెండు వందలకు పైగా ఉన్నాయి. ప్రతివారం తరుణి పాఠకుల కోసం 10 పొడుపు కథలు ప్రచురిస్తున్నాము. జవాబుల కోసం ముందే చూడకండి. మీరు ప్రయత్నించండి .తర్వాత క్రింద ఇచ్చిన జవాబులతో సరిచూసుకోండి- సంపాదకులు)
1. అన్నదమ్ములు రెండు రొట్టెలు నంచుకోకుండా తినాలి
2. కమ్మంగా ఉంటది.తీయ్యంగ పోతది.
3. ఒక్క గుద్దుకు ఇద్దరు పిల్లలు.
4. గుట్ట కాల్తుంటే బట్టలు ఎండేస్తారు
5. చీకటింట్లో జడల దయ్యం
6. ఒక పండు పండుకు 12 పచ్చెలు, పచ్చెకు 30 గింజలు.
7. గుట్ట చుట్టు పిట్ట తలకాయలు
8. పుట్టడు శనిగల్ల ఒక్కటే ఇసుక రాయి
9 బుడబోడకాయ, బొట్ల బొట్లకాయ, కారాకు పచ్చని కండంత తియ్యన.
10. ఇంటింట గుడి కాదు.ఈశ్వరుని గుడి కాదు.కంచు గోపురం గాదు.లేవట్ట వశం గాదు
_***_
( జవాబులు:- చెరి ఒకటి, కోడి, వేరుశనగ కాయ, పొయ్యి రొట్టెలు, ఉట్టి, సంవత్సరం, కల్లు లొట్లు, నక్షత్రాలు ఆకాశం, సీతాఫలం, ఆకాశం)