ఒకరికొకరు

కథ

డా. అరుణపరంధాములు

నిద్ర మబ్బులో ఏమి జరిగిందో రంగయ్యకి బోధపడలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఇల్లంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. హఠాత్తుగా నిద్ర నుండి తుళ్ళిపడి లేచాన? అన్నంత అలజడి మొదలైంది రంగయ్య మనసులో ఏదో పిడకల.

రంగయ్య తన ఇంట్లోలో చీకట్లో కూర్చున్నాడు. అతని కాళ్లు, చేతులు వణుకుతున్నాయి వృద్ధాప్యంతో  కొంత, భయంతో కొంత…. ఏదో ఆవేదన…. ఏదో చికాకు….అంతా అగమ్యగోచరమే…

“తాత ఎందుకు హఠాత్తుగా నిద్ర నుంచి  తుళ్ళి పడిలేచావు?” అని మెల్లిగా అడిగింది మనవరాలు.

“నీకెందుకే? ఓ కసురు, కసురుకున్నాడు…!   “ఏదో..  పీడకల” అన్నాడు తాత.

“మనుమరాలు మళ్లీ  మాట్లాడడానికి సాహసించలేదు”.

రంగయ్య తనలోతాను గోనుకుంటూ… మెల్లిగా మనుమరాలుకు చెప్పటం మొదలెట్టాడు.

“మొన్ననే మీ బాబాయిలు వచ్చి పొలన్ని వారి పేరున రాయమన్నారమ్మా. నేను పొలం రాయటానికి ఒప్పుకోలేదు వాళ్లకు కోపం వచ్చింది. పెద్ద గొడవ పెట్టుకున్నారు. పిల్లలందరొకటయ్యారు మీ నాన్నమ్మ చనిపోయటంతో నేను ఒంటరయ్యాను?. నా పిల్లలు! నున్ను ఒంటరి వాణ్నిచేశారే!.. అన్న మనోవేదన, నేను ఒంటరి వాణ్ని….. అంటూ……

పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని… “నేను బతికుండగానే నా ఆస్తి అంతా వాళ్ళ పేరున రాయాలంటమ్మా….” రేపు వాళ్ళు నన్ను చూడకుంటే  నేనేమైపోవాలి….. అంటూ తన మనసులోని బాధను బయటపెట్టాడు తాత.

 “తాత! నీ పీడకలకు ఇదా కారణము…! అంటూ మనవరాలు తాతను ప్రేమగా దగ్గరకు తీసుకుంది”. “నాన్నమ్మ చనిపోవటంతో ఒంటరితనంతో భయపడుతున్నాడు తాత…..”  

“తాత కళ్ళల్లో నుండి కన్నీరు బొటబొట కారుతున్నాయి.” తాత కంటనీరు తుడుచీ….

పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని తానును తాను ఓదార్చుకుంది తాత కంట పడకుండా.

“నా ఆలన పాలనా చూసుకోవాలని నాన్నకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు….. ఆమెకేమో! నేనంటే కోపం.. ఈ పిల్ల తల్లి గండాన పుట్టిందని…. తల్లిని చంపినపిల్లన్ని

కాన్పు కష్టమై…?…. చనిపొయింది కాని…..

మా నాన్న!ఎలా ఉండగలుగుతున్నాడో? నన్ను వదిలి? తప్పదు….గా! విధి యెంత విచిత్రమైనదో….

పిన్ని ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేదట నాన్నతో? అందుకే తాత నాన్న సుఖం కోసం నన్ను తెచ్చి పెంచుకున్నాడు ఆరు నెలల వయసులోనే తన ఆస్తిoతా నా పేరునా రాయాలని తాతయ్య కోరిక. తల్లి లేని పిల్లని?”

ఇంతలో తాత “చందూ” అంటూ పిలిచాడు

“ఆ తాత అంటూ పరుగెత్తుకెళ్ళా”

“తాతయ్యా”

“ఆ ఏం లే”

“……”

“చెప్పు తాతయ్యా”?

“నిన్నుపెంచిపెద్దచేసిచదివించిన! నీకు పెళ్లిచేస్తే నా పనైపోతుందమ్మా అన్నాడు తాత”.

“అంతే అంటావా తాత”?

“అవునమ్మా” తప్పదుకదమ్మా అన్నాడు తాత?

“తాతయ్యా! నాకు పెళ్లి చేసి నీకు దూరం చేయటం నాకు నచ్చలే అన్నది.?”

 “జీవితం అంటే అంతే గా తల్లి! ఎప్పుడైనా? ఎవ్వరైన? భార్యాభర్తలు బతికినన్నాళ్లు కలిసి ఉంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరు పోయిన? వాళ్ళు ఒంటరెగా! ఒంటరిగా ఉండాల్సిందేగా ?”

“తాత?”

“అంతే కదమ్మా” పిల్లల్ని కనటం పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు పెద్దయ్యాక తల్లిదండ్రులను చూసుకుంటే ఫర్వాలేదు! చూసుకోకుంటే? చేసేదేమీ లేదు. అది వాళ్ల మానవత్వం? లేకుంటే తల్లిదండ్రులు ఒంటరే అన్నాడు….”

“తాతా పిల్లలు అవసరమా?మరి అన్నది?”

“మౌనంగా వున్నాడు తాత”

“ఎందుకు తాత? ఈ పిల్లలు? పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు అవసరమా?” అని భయంగా వొణుకుతున్న స్వరముతో గట్టిగా రెట్టించిoది.

“ఈ రోజుల్లో పిల్లలకి మానవత్వం నశించిందమ్మా? వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారే తప్ప? పెద్దవార్ని చూసుకోవాలన్న ఆలోచన అసలు వాళ్ళ మనసుల్లో లేదు. వాళ్ళ లైఫ్ ఎంజాయ్ కీ తల్లిదండ్రులు అడ్డు అని వాళ్ల అభిప్రాయం అని తాత అనగానే…..”

“ఈ తల్లిదండ్రులు కూడ పిల్లల మనస్తత్వాన్నిబట్టి మారాలి. యెప్పుడు పాత చింతకాయ పచ్చడిలా వుంటే “వాళ్ళు”! ఇలానే ఆలోచిస్తారు మరీ అన్నది చందు….”

అంతే అంటావా అన్నాడు తాత!

“…….. కాకపోతే?కల్లెగరేసింది చందు “

“అందుకేనే నేనో నిర్ణయానికీ వచ్ఛాఅన్నాడు తాత!”

“ఈ ముసల్తనానికా తాత?” అన్నది చందు.

“నా పిల్లలకు పూర్తి స్వేచ్చనిచ్చా!వాళ్ళు ఏది అడిగినా కాదనలేదు!నా ఈ రోజు పిల్లలు ఆస్తి ఆడుగుతుంటే… నా పిల్లలా! ….? యేనాడు ఊహించుకోలే…! ఇన్నేళ్లు వాళ్ళతో ప్రేమగా ఉండబట్టే ఈ బాదలు అన్నాడు తాత!”

“నా ఆస్తి కావాలనుకున్న వాళ్లు? బ్రతికినన్నాళ్లు  చూసుకోవాలి అప్పుడైతేనే వారికి ఆస్తిస్తాను. లేకుంటే ఇవ్వను.?

నన్ను చూసుకోకపోతే ఈ ఆస్తoతా ఓ అనాధాశ్రమానికి రాస్తాను అని చెప్తానమ్మా అన్నాడు తాత!”.

“అంతే చెప్పు తాత”

“నీకు పెళ్లి చేసి ఆస్తియిచ్చి చెప్తా” ఓ పనైపోతుంది”

“నాకు ఆస్తిస్తే ఊరుకుంటారా తాత!”.

….. వాళ్ళు ”వొద్దు?” అంటే నేను ఊరుకుంటనా?

 “తాతయ్య పెళ్లి చేసుకొని నీకు దూరంగా ఉండలేను! నన్ను చేసుకోబోయే వాడు మీ తాతయ్య మన దగ్గర ఉండొద్దoటే! నిన్నుముసలితనంలోఒంటరిగావిడిచి ఉండలేను? పెద్దయ్యాక రెక్కలోచ్చిన పక్షీలా ఎగిరిపోతే నువ్వు ఏమైపోతావు?”తాత పరిస్థి చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. విడిచిపెట్టి వెళ్లాలంటేనే ఏభయంగా ఉంది తాత.

“కాదమ్మా ఆడపిల్లవి నిన్ను ఒకరి చేతిలో పెట్టకపోతే ఎలా చెప్పమ్మా?”

“ఆడ? మగ? తేడా ఏంటి తాతయ్య.” ఏవ్వరికైన మనస్సు….ఉండాలి  గా…!”

ఇద్దరు మాటల్లో లోకాన్ని మైమరిచిపోయారు?

ఇంతలోగది తలుపులు తెరుచుకున్నాయి “ఏమ్మా? మేము లేనట్టా! ఆస్తంతా కాజేద్దామనే! అయినా ఈ ముసలోడికి బుద్ధి ఉండాలిగా!. పెంచుకున్న నీపై ఇంత ప్రేమ ఉంటే? కన్నా మాపైఎంత ఉండాలి.?”….

  అందరీకీ సమానంగా వాటా ఇవ్వు? నీ వాటానీ మనవరాలికిచ్చుకుంటావో? దానధర్మాలు చేస్తావో? అది నీ ఇష్టం. అంతేకానీ! ఆస్తిoతా ఇస్తానంటే ఎవరూ ఊరుకోరిక్కడ?” అని జేబులోనుంచి ఫోన్ తీసి  తమ్ముడు “సుందరం బాబాయ్” ఫోన్ చేశాడు. పెద్ద బాబాయ్!…”

“తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడిక్కడికి! నాన్న రాలే…”

“వీళ్ళకు కెంతసేపూడబ్బురంధి తప్ప మరేమీ లేదు!తండ్రీని చూడాలంటే మళ్ళీ దొరుకుతాడా? యెందుకు వచ్చారందరూ? మనసులో గొనుక్కుంటుంది. వాళ్ళ దృష్టిలో తండ్రీ జీవితనికీ విలవ అంటూ యేడిస్తేనా?తప్పంతా తాతదే!ఏమయితే యేం?వాళ్ళకు ఆస్తి కావాలి.

“బాబాయ్!” మీకు డబ్బేగా కావాల్సింది! ఇప్పిస్తాను! తాతయ్యను ఒప్పిస్తాను ఉండండి” అన్నది చందు.

“చందు” నోట ఆ మాట వినగానే బాబాయ్ మనస్సు ఆనందంతో గెంతులు వేసింది” మేము ముసలి వాళ్ళ అయ్యాక! ఆస్తిస్తే ఏం లాభం? మాకు అవసరాలు ఉంటాయిగా? నువ్వైనా చెప్పమ్మా”

“బాబాయ్! ఈరోజు ఆస్తి అడుగుతున్నావు సరే! ఏ రోజైనా? తాతయ్యతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చవా?”

“నాకు టైం ఎక్కడుందమ్మా”

“టైం లేదా! బాబాయ్”

“….. ఆ లేదుమ్మాఅన్నాడు బాబాయ్”

“రేపు పెద్దయ్యాక మీ పిల్లలు ఇలా అంటే అంది చందు!”

 “అప్పుడు ఆలోచిద్దాంలే” అన్నాడు బాబాయ్”

“బాబాయ్! తాతతో ఆస్తి ఉంది కాబట్టే మీరు ఈ మాత్రమైన రాగలుగుతున్నారు లేకుంటే అసలు వచ్చేవారు కారేమో?

“అబ్బా! ఏంటే…! నీ గొడవ పెద్ద పోటుగత్తెలా? లెక్చర్? ఇస్తున్నావు! వచ్చిన పని కానిఫస్ట్” మీ నాన్న కూడ వస్తునాడు…. “పైసమే పరమాత్మ” అంటారందరూ ఆ కాలం వేరు? ఈ కాలం వేరు? ఆ కాలం వారికి! ఇప్పటిలా టెన్షన్స్ లేవు అందుకే వాళ్ళు హాయిగా ఉన్నారు. డబ్బు, ఆరోగ్యం సంపాదింకున్నారు ఇప్పుడు లేచింది మొదలు పడుకునే వరకు ఒకటే టెన్షన్.మీ తాత లా మంచి జీవితం…. కాదు మాది ……

“బాబాయ్!”

బాబాయ్! నిజమే మాట్లాడుతున్నావా? తాత ఒంటరిగా ఉండి ఎంత బాధ పడుతున్నాడో నాకు తెలుసు? మీ అందరూ అనుకుంటారు తాత దగ్గర డబ్బు ఉంది సుఖంగా ఉంటుండని “కానీ అది తప్పు”? డబ్బు ఒకటే కాదు మనిషికి కావాల్సింది. మనుషులు కావాలి? అది “తనను ప్రేమించే మనుషులు కావాలి”? తను ప్రేమించే మనిషి పోయిందని తాత ఎంత బాధ పడుతున్నాడో మీలో ఏ ఒక్కరికైనా తెలుసా….?నిజంగా నేను లేకుంటే…?

అంటూ ఒక్కసారి తన ఏడుపును ఆపుకోలేకపోయింది. ఈ ఆస్తి వున్నందుకే గా గొడవ తాత వైపు తిరిగి అంది చందు. ఈ ఆస్తంతా ఇచ్చేయి వాళ్ళకు”….

ఆస్తి నాలుగు భాగాలు చేశాను. వాళ్ల ఆస్తి వాళ్ళకి ఇచ్చి! నా ఆస్తి? నన్ను ఎవరు చూస్తే వారికి ఇస్తాను! నా పిల్లలు ఇంత కఠినంగా ఉంటారని అనుకోలేదు అమ్మ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని అన్నాడు తాత…

“తాత కంట నీరు చూడగానే బాబాయి మనసు చలించిపోయింది”. నాన్న! నువ్వు ఇంత బాధ పడుతున్నావా.?  బాధతో  ఆస్తి ఇవ్వొద్దు నాన్న.

“నువ్వు సంతోషంతో మాకు ఆస్తివ్వాలి” అంతేకానీ “నీ కంటనీరా”!

“నీ భయమంతా చెందుపెల్లేగా” తప్పకుండా……  

“చందు” వయసు చిన్నదైనా నా మనసును మార్చిన “అమ్మవు తల్లి” నాకు అమ్మ లేదుగా! అందుకే  నా మనస్సు ఇంత కఠినమైందెమో! రేపు నా పిల్లలు ఇలా చేస్తే నేనేమైపోయేవాడిని. చందు నిజంగా నువ్వు గొప్ప దానివి తల్లి అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు బాబాయ్. మా నాన్నకు నువ్వు తోడు వున్నావు రేపు నాకు….. వామ్మో! ఏం చెప్పడానికీ దారి కావపడలే…..

మీ ఇద్దరు “ఒకరికొకరు” తోడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉంటున్నారు అన్నాడు బాబాయ్.

“బాబాయ్”  నన్ను ప్రేమగా కౌగిలించుకున్నాడు.

 

                                                                                       డాక్టర్. అరుణ పరంధాములు.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉల్లాసం

సాహిత్యంలో చిరుధాన్యాలు జొన్నలు