నానీలు

యలమర్తి అనురాధ

ఓటమితో
పోరాటం
ఆరాటం చేయూత
విజయానికి నాంది
*
చెట్లు హర్షం
అటూ ఇటూ ఊగుతూ
వర్షంకి స్వాగతం
ఆనంద సంకేతం
*
వంటింట్లో
పాత్రల డబడబలు
భర్త గారికి
మూడిందేమో( !
*
భవనం అంచున
ఒంటరి పావురం
జత కోసం
ఇప్పటి అబ్బాయిల్లా ! !
*
ప్రకృతిలో
వెదుకులాట
కవిత్వ వర్షం
బిరబిరా! జరజరా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

ఎంత బాగుండో