క్షణాలు ఆగకుండా గడిచిపోతున్నాయి నిమిషాలు గంటలు రోజులు …
నిమిషాల ఏమి జరుగుతుందో తెలియని విపరీత పరిస్థితులు. చదువుల కొరకని కళాశాల దారి పడతారు. ఇంట్లో కన్నవాళ్ళకి అబద్ధాలు చెప్తారు. డబ్బులు ప్రేమ రెండు సమానమైపోతున్న రోజులు ఇవి. తూనిక రాళ్లు వాళ్లే, తూచే తరాజులు వాళ్లే! స్నేహితులు సినిమాలు షికారులు యువకుల లెక్కల ఖాతాల్లో చేరిపోతుంటాయి
ఉన్నది కదా సంపద! మాకు కాకుంటే ఇంకెవరికి పెడతారు అనే ధోరణి మొదలైంది. ఎంతసేపు తన స్వార్థం చూసుకోవడమే అలవాటైపోయింది. ఇంట్లోని వారి బాధకి అవసరాలన్నీ తీరుస్తున్నది అమ్మ. అమ్మ వైపు. చూద్దామన్న ధ్యాసే లేని యువత.
తరాలు మారుతుంటే అంతరాలు పెరుగుతుంటాయి,ఇది జగమెరిగిన సత్యం. అలా అని అబద్దాలను నిజాలు చేయాలని నమ్మించి పనుల్లో అవకతవకలు చేస్తున్నారు. సినిమాలు చూడాలి సెల్ ఫోన్ లో చాటింగులు చేయాలి . ఏ కొత్త ఫోన్ వస్తే అదిచేతిలో ఉండాలి. కనిపించిన ఆప్ లన్నీ డౌన్లోడ్ చేసుకో వాలి. అన్నీ అందిరికీ చెప్పుకోవాలి, అన్నీ అందిరికీ చూపించాలి. అందరివీ చూడాలి అన్నీ తెలియాలి కానీ చదువు వద్దు . ఫోన్ ఒక్కటే కావాలి. అసత్యాలే జీవితం అయిపోయింది.
బట్టల కోసం చెప్పులకోసం చేసే యాగీ పుస్తకాలకోసం చేయరు. తెరమీద ఆడే ఆటలు నిజం కాదని తెలుసు. నటన కోసం వెండితెర మీద. కనిపించే వన్నీ నచ్చేసే వేలం వెర్రి. కుళ్ళు జోకులు ద్వందార్థాల డైలాగ్ లూ కత్తికొకరుగా రక్తపాతాలు. హత్యల దృష్యాలు . అది హీరోయిన్ పక్షమా హీరోల పక్షమా. హీరోయిన్ ల పక్షాన నిలబడి వాదోపవాదాలు చిత్రం టైటిల్ పైన బెట్టు క్రికెట్ జట్టు మీద బెట్టు బెట్టు కట్టేంత డబ్బులు ఉన్నాయా? మీదైన స్వంత కష్టార్జితమా? ఏదీ కాదు అయినా ఆగరు .
ఈ విష వలయం నుండి బయట పడాలంటే తల్లిదండ్రులు ముందు మారాలి. విత్తొక్కటి పెడితే చెట్టొక్కటి మొలుస్తుందా? యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రపంచాన్ని మార్చాలి .