భారతీయ ఋషిపరంపర

7. భీముడు : ‘చిత్రకర్మశాస్త్రం’

ఇతని ప్రావీణ్యం ఎంతటిదంటే…. ఒక మనిషి ‘గోరు’ గాని ‘తల వెంట్రుక’గాని, చిన్న ‘ఎముక’గాని చూచి ఆ వ్యక్తి రూపమును అద్భుతంగా చిత్రించేవాడట!! బీముడు 200 రకాల  చిత్రలేఖన ప్ర్రకియలు ‘చిత్రకర్మశాస్త్రం’ అనుగ్రంథంలో 12 అధ్యాయాలు రచించాడట.

8. మల్లుడు : మల్లశాస్త్రం

ఆరోగ్య పరిరక్షణకు కసరత్తులు, క్రీడలు, వట్టి చేతులతో చేసే ’24’ రకాల యుద్ధ విద్యలు ప్రపంచానికి అందించాడు. మల్లుడు రాసిన పోరాట విద్యలు కనుక దీనికి ‘మల్లశాస్త్రం’ అనే పేరు వచ్చింది.

9. వాత్సాయనుడు : ‘రత్నపరీక్ష’

వాత్సాయనుడు అనగానే వెంటనే స్ఫురణకు వచ్చేది ‘కామసూత్రం’ గ్రంథం. కానీ ఇతడు ‘రత్నపరీక్ష’ అనబడే శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. రత్నాలకున్న 24లక్షణాలు  వాటి శుద్ధత గుర్తించడానికి 32 పద్ధతులు, వాటి బరువు తూచే విధానం వాటి రూపం వంటి విషయాలు పొందుపర్చాడట.

10. వీరబాహు : ‘మహేంద్రజాల శాస్త్రం’

వీరబాహు సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడిగా పురాణాలలో చెప్పబడింది. ఈయన నీటిపై నడవడం గాలిలో తేలడం వంటి ఎన్నో చిత్ర విచిత్ర భ్రమలను కల్గించే గారడీల గురించి ఈ గ్రంథంలో రచించారు.

Written by N. Uma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గోవిందనామాలు

నుడిక్రిడ -5