సనాతన ధర్మ ప్రకారము కాలాన్ని ఆయనాల కింద సంవత్సరాలకింద, నెలలు కింద, పక్షాలు, వారాలు,దినాలు, తిథులు, నక్షత్రాలు, యోగాలు, కరణాలుగా విభజించారు. అందులో ఇప్పుడు నడిచేది దక్షిణాయనం. పండుగలు పర్వదివనాలతో కూడిన దినాలు ఈ ఆరు నెలలు. సంత మహాపురుషులు,యోగులు, పీఠాధిపతులు ఆషాడశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చతుర్మాస దీక్షను చేపడతారు. ఈ దీక్ష చేపట్టిన వారు ఈ కాలం అంతా ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కూడి కామ క్రోధాదులను విసర్జిస్తారు. తపోద్యాననిష్టలతో కాలం గడుపుతారు. ముఖ్యంగా వర్ష ఋతువు వెళ్లి శరదృతువు ప్రవేశిస్తుంది. ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పండు వెన్నెల కాస్తుంది. వర్షాల వల్ల చల్లబడిన వాతావరణం మరియు చలి ప్రవేశించే కాలం కూడా. ఈ వాతావరణం ప్రజలఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపి అనారోగ్యాలకు గురి అవుతారు. జీర్ణశక్తి కూడా మందగించి ఉంటుంది. వర్షాలు వల్ల తాగే నీరు కూడా కాలుష్యం అవుతుంది. దీనివలన కలరా,టైఫాయిడ్ కామెర్లు వంటి రోగాలు ప్రభలుతాయి. అందుకే ఈ మాసంలో కార్తీక సోమవారాలని, నాగుల చవితి, ఏకాదశి, పూర్ణిమ రోజులలో ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రతి ఆరోగ్యంతో కూడిన కూడినఆచారాన్ని దేవుడితో ముడిపెట్టారు పెద్దలు. పామరులు పాప భయంతోనో,భగవంతుని ప్రీతి కొరకో వీటిని శ్రద్ధతో పాటిస్తారని. దీనితోసాత్విక భావం, ఆరోగ్యము కూడా సమకూర్తాయి. ఈ దీక్షలు శ్రద్ధతో ఎవరు చేసుకుంటే వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాయని గుర్తుతెరంగాలి.
ఇప్పుడు మనం చేసే క్షీరాబ్ధి ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ రోజునే దేవదానువులు అమృతమద నం చేయబోయారట. మహాభారతం ప్రకారం భీష్మ పితామహుడు అంపశయ్య మీద శయనించారట ఈరోజు.దీన్ని ఉత్తన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడని పురాణ కథనం. విష్ణువు యోగనిద్ర నుంచి లేచాడంటే తన బలాన్ని వృద్ధి చేసుకున్నట్లు అని వేదంలో చెప్పబడింది. మనం కూడా పగలు పనిచేసే ఆ అలసట పోవడానికి రాత్రినిద్రపోతాము. మరల మనం ఉదయంశక్తితోకూడిలేస్తాము.ఇదిప్రకృతిలోజరిగేసహజమార్పు. మనం చేసే యోగాసనాల్లో కూడా యోగ నిద్ర ఉంది కదా. దానివలన మనలోని సమస్త అవయవాలు శక్తిని పుంజుకుంటాయి. ఈ క్షీరాబ్ధి ఏకాదశి నాడు మహావిష్ణువుని పూజించి ఏకాదశి వ్రతం చేస్తారు. ఏ మతాల వారికైనా వారు నమ్మిన దేవుని గురించి తెలుసుకోవడానికి ఏవో మత గ్రంధాలో, పురాతనఆధారాలో ఉంటాయి .
వాటినే వారు అనుసరిస్తారు. జ్ఞానపరంగా చెప్పాలంటే మనలోని షడ్ వికారాలను, మనసు,బుద్ధి, చిత్తము, అహంకారం అనే 11 ఆసురీ గుణాలను జయించి దైవీ గుణాలను ప్రోగుచేసుకోవడమే వీటి ఉద్దేశం. ఈ శుభదినాలు మళ్లీ మళ్లీ రావడానికి కారణం కూడా మనల్ని మేల్కొల్పడానికే .
ఇవి రోజు విష్ణు ఆలయాలన్నీ ఎంతో వైభవంగా అలంకరించబడి ఉంటాయి. హరిహరులు ఇరువురికి భేదం చూడని మాసం ఇది. ఈరోజు ఉపవాస దీక్ష పాటించి ద్వాదశి నాడు పారణ చేస్తారు. దీని మహత్యం గురించి మనకు అంబరీ సోపాఖ్యానము చక్కగా విశదీకరించింది . ఇందులో భగవంతుడు భక్తుడికే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. సద్గుణాలన్నీ భగవత్ స్వరూపాలే కదా. మన భగవత్ నామాలు చదివేటప్పుడు నిర్గునుడు, నిరంజనుడని, ని క్రోధుడు, నిష్పాపుడని చదువుతాం కదా. మనం కూడా అలా కావాలని తెలియజేయడమే.
ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కొద్దిగా మిగిలాయని చెప్పవచ్చు. వీటివలన నే కదా మానవ నాగరికత నిలిచేది,తెలిసేది. ఇప్పటికీ మనం గడిచిపోయిన ఎన్నో నాగరికతలను తలుస్తున్నాం. ప్రతి మనిషికి తమ ప్రాంతానికి, జాతికి, తమ కుటుంబానికి సంబంధించిన నాగరికతలుఉన్నాయి.వీటినే సాంప్రదాయాలు, ఆచారాలుఅంటాము. అవి నిలుపుకోవడమే మన ధర్మం కూడా. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఈ సాంప్రదాయాలను భావి పౌరులైన మీ పిల్లలకు కూడా తెలపాలి. మన పండుగలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. అంటే మన ప్రకృతితో సహజీవనం చేస్తున్నామన్నమాట. దానిని రక్షిస్తూ, మనని మనం రక్షించుకోవడమే ఈ శుభదినాల ముఖ్య ఉద్దేశ్యం.