తెలుగువారింట పెళ్లి అనగానే
లక్ష్మీ నారాయణుల ప్రతిరూపాలై వెలుగులీనే
పెళ్ళికొడుకు,పెళ్లికూతురు
దూర తీరాల నుండి తరలి వచ్చే ఆత్మీయులు
ప్రేమాభిమానాలతో, ఆత్మీయ ఆలింగనాలతో
పలకరింపులు
చిన్నా పెద్దా అంతా కలిసి చేసే
కోలాహలం
మరపురాని మధుర స్మృతుల ఆనందహేల
అందరి మనసుల్లో ఉప్పొంగే సంతోషాల సంద్రం
ఇదే తెలుగు వారి పెళ్లి సందడి గొప్పతనం