జి మేరీ కృపాబాయి గారు ప్రముఖ రచయిత్రి ఆమె 1962 డిసెంబర్ 13వ తేదీన జన్మించారు ఆమె పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రంలో పీజీ పట్టా పొందారు
పదవ తరగతి చదువుతున్నప్పుడు ఆమె సాహిత్య అభివృద్ధి కలిగి అనేక రచనలు చేశారు ఇప్పటికీ 400 కథలు వివిధ ప్రముఖ వార మాస పత్రికల్లో ప్రచురితమైనాయి
.కృపాంజలి ,కథాంజలి, కథా నీరాజనం అనే మూడు కథా సంపుటిలు ప్రచురించారు
ఆమె మొదటి కథ మార్పు ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురించడం జరిగింది .
అప్పటినుండి ఇప్పటికీ అనేక కథలు ఆంధ్రభూమి స్వాతి ,నవ్య ఈనాడు మల్లెతీగ విపుల యోజన సాక్షి ,మొదలైన ప్రముఖ పత్రికలలో ప్రచురించబడినాయి అంతేకాకుండా రేడియోలో అనేక కథానికలు ప్రసారం కాబడినాయి దూరదర్శన్ లో ఆమె కార్యక్రమాలు అనేకం ప్రసారం కాబడినాయి ఆమె అనేక గెస్ట్ లెక్చర్స్, సెమినార్సు ఇవ్వడం జరిగినది.
ఆమె వందకు పైగా అవార్డులు పొందినారు భర్త బనియన్ రాజు గారిసహకారంతో ఆమె సాహిత్య రంగంలో ముందుకెళ్ళినారు కుమార్తెలు రుచిర ,రచన ,ఉన్నత విద్యారంగంలో ముందుకెళ్లినారు అల్లుళ్లు డాక్టర్ దుర్గాప్రసాద్ మరియు నవీన్ ఆ కుటుంబం లో ఆణిముత్యాలు.
మనవరాలు ఆకృతి ముద్దులొలికే బిడ్డ. శ్రీమతి జి మేరీ కృపా బాయి గారు ప్రస్తుతం పామర్రు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు కథా రచన ద్వారా ఆమె సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు సామాజిక రుగ్మతలకు ఒకే ఒక మందు సాహిత్య రచన అని ఆమె అభిప్రాయం.
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థుల కు సాహిత్య అభిలాష కలుగజేస్తూ వారి చేత చిన్న చిన్న రచనలు చేస్తూ ఉన్నాను కథలకు సంబంధించిన వర్క్ షాప్ లను విద్యార్థులకు కండక్ట్ చేస్తున్నాను వివిధ సాహిత్య ప్రక్రియలను వారికి పరిచయం చేస్తున్నాను.
అని ఆమె తన అభిప్రాయాన్ని తెలియపర్చారు..