తుళ్ళింతల్లో మనస్సు
కేరింతల్లో వయస్సు
తమస్సు వీడి చైతన్య ప్రదీప్తులు
ప్రణయ రాగాలనే వెదజల్లు
చదువు నేర్పిన సంస్కారం
సంస్కారం తెచ్చిన బాధ్యత
బాధ్యత లో బంధాలు
బంధాలకు తోడు అనుభూతులు
అనుభూతుల సమాహారాల ఆలోచనలు
ఆలోచనలు అభిప్రాయాలై
అభిప్రాయాలు ఆచరణలై
ఆచరణలు క్రమశిక్షణా రూపాలై
రూపాలు ఆనంద పారవశ్యాలై
చిత్తరువు లో విచిత్రమైపోయె
ప్రేమ సాగరం లో ఏకాంత పయనాలు
విరి పూతలూ
సుమ గంధాలూ
సునిశిత పరిశీలనలూ
సౌశీల్య పరిణయాలూ
భావి తరాల మధ్య వారధులు
కలలూ కలబోతలూ
చిత్ర కవిత – డాక్టర్ కొండపల్లి నీహారిణి ,తరుణి సంపాదకులు