నాలుగు రాళ్లు వెనకేసుకున్నంత
సంబరం కాదు
నలుగురు మనుషులు నీ వెనుక ఉన్నట్టు కాదు
నలు దిక్కులూ పిక్కటిల్లేలా
గొంతు ఎత్తినట్టు కాదు
నలభై ఆమడలు నడచినంత
సులభం కాదు
ఒక్క మొక్క చేతబట్టి
పాలకంకులు మేసే మేక తో ప్రయాణం
అణువణువు
పచ్చని జీవితాన్ని
అందిపుచ్చుకొని
అమ్మతనాన్ని వెంట తెచ్చుకొని
జైత్రయాత్ర చేసినట్టు
ఆమె ప్రకృతి
ప్రకృతి ఆమె
కొలవలేని సంపద
కోరగల పెన్నిధి
చిత్ర కవిత:- డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకులు