ఎవరెన్ని చెప్పినా ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి, పోతాయి. కొందరు నాయకులను మిగిల్చేవే ఎన్నికలు.అందరి జీవితాలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి ఎన్నికలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎంపిక విధానాన్ని సిద్ధం చేశారు.
మన దేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య వచ్చింది.ఎన్నో పోరాటాల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి విముక్తి అయ్యాం.1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్నాం.అమలుపరచుకుంటున్నాం. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగాన్ని 42 వ రాజ్యాంగ సవరణలో భాగంగా నిర్ణయించుకున్నాం.
దేశ పౌరులందరికీ కొన్ని హక్కులు బాధ్యతలను నిర్ణయించుకున్నాం. స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం న్యాయం దేశ పౌరులందరికీ సమానంగా దక్కాలి అనే నిర్ణయంతో ఏర్పరచుకున్నాం. ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం అనేవి బ్రిటన్ నుండి, ప్రాథమిక హక్కులు అత్యున్నత న్యాయస్థానం అనేవి అమెరికా నుండి, ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక వంటివి ఐర్లాండ్ నుండి, ప్రాథమిక విధులు అనేవి రష్యా దేశం నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి విషయాలు కెనడా వారి నుండి, అత్యవసర పరిస్థితి అనే విషయాన్ని జర్మనీ దేశం నుండి గ్రహించుకొని ఇంకా మన దేశ సామాజిక పరిస్థితులను బట్టి ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఒక విధానానికి కట్టుబడి ఉన్నాము. అత్యవసర అవసరాలను బట్టి షెడ్యూల్ లను మార్చుకుంటూ చేర్చుకుంటూ మన రాజ్యాంగ వ్యవస్థ నడుస్తున్నది.
మన దేశం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రముఖ రాజకీయ విధానానికి ఈ రెండు పదవులు ఉదాహరణలు.
ప్రధానమైన పార్టీలు ఈ ఎన్నికల విషయంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
ఇప్పటికీ 1952 నుండి 20 19 వరకు 17 తడవలు 5 ఏళ్ళ కొకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు 2023 నవంబర్ 30న జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఉన్నాం.
ప్రతి వయోజన పౌరులందరూ వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో పోటీలు చేస్తూ నిలబడిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీన్ని ఓటు వేయడం అంటాం . Representative Democracy లో ఇది ఒక పద్ధతి. Political ఎలక్షన్స్ లో ఎమోషన్స్ కంటే ఆలోచన కు ప్రాముఖ్యత ను ఇవ్వాలి. నిలబడిన నాయుడు ముఖ్యమా? పార్టీ ముఖ్యమా అని ఆలోచిస్తే విలువలు ఎలా ఉన్నాయో చూడాలి. ఇది పెద్ద సంకట స్థితి. అయినా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
మహిళా సాధికారత అంటారు, మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న మనీ అన్ నేను ఎప్పుడూ జాగ్రత్తగా గమనించాలి. హామీ లు గుప్పిస్తుంటారు. నిజానిజాలు తెలుసుకోవాలి, పరామర్శ చేయాలి . ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ … ఓటు హక్కు ను వినియోగం చేసుకోవాలి.