చల్లగాలికి
గట్టుపైకి చేరాను
నా ప్రియనేస్తం
వేపచెట్టుకు వీపు ఆనించా
దాని కెంత ఆనందమో!
నా ప్రాణమా
అన్నట్లు
ప్రేమగా కదిలింది
ఆ స్పర్శ
అనుభూతికి అందనిది
అంత పెద్ద చెట్టు
నా ఉనికి గమనించి
ఊగిందంటే
కాండమే కదిలిందంటే
ప్రపంచంలో ఎనిమిదో వింత
ఈ నా చెట్టు స్పర్శే!
గమనిక: ఈ స్పర్శ మీకూ కావాలంటే
యూత్ హాస్టల్,హైద్రాబాద్ కి
వెళ్లాల్సిందే!