ఆత్మీయత ప్రేమ గా పలకరింపు
ఎదిగిన కొద్దీ ఒదిగిన మనస్తత్వం రేడియో లో వివిధ విభాగాల్లో పనిచేసిన మహిళా మణి.
చిత్తూరు లోని పెరుమాళ్ళు అనే పల్లెలో అమ్మమ్మ గారింట పుట్టిన ఆమె ఆకాశవాణి వివిధ కేంద్రాల్లో వివిధ రకాల బాధ్యతలను నిర్వహించారు.
డాక్టర్ కె.విజయ ఇంటర్ బైపిసి చదివారు.2మార్కులు తక్కువ కావటంతో మెడిసిన్ లో సీటు రాలేదు.బి.డి.ఎస్.చదవనని మొండికేయటంతో తండ్రి ప్రోత్సాహం తో అగ్రికల్చర్ బి.ఎస్సీ.లో చేరారు.కేవలం ముగ్గురు అమ్మాయిలున్న కాలం అది.చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ అని అబ్బాయిలు నిక్ నేమ్స్ తో పిల్చేవారు.చిలకమ్మ విజయ కాలేజీ నాటకంలో బామ్మ వేషంవేసి బెస్ట్ యాక్టర్ బహుమతి పొందారు.సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నృత్యం కొంత కాలం నేర్చారు.ఇంటర్ స్కూల్ పోటీల్లో “నోమీనోమల్లాల” పాటకి డాన్స్ లో ప్రైజ్ వచ్చింది.బి.ఎస్సీ లో ఆటల్లో బోలెడన్ని బహుమతులు పొందారు.విశ్వామిత్రునిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.1982 లో ఎం.ఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు.
ఆమె తల్లి హేమలత 8వఫారంచదివారు. ఇప్పుడు దైవస్మరణతో
భక్తి స్తోత్రాలు చదువుతూ ఉంటారు.నాన్నగారుశ్రీ కె.వెంకటరెడ్డిగారు అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్ గా చేసి రిటైరైనారు.ఆయన తల్లి దండ్రులు విద్యావంతులు కాకపోయినా రెడ్డి గారు రోజూ 5మైళ్ళు కాలినడకన బడికెళ్ళిB.A.Hons M.A.Phd.చేశారు.కాలేజీపిల్లలకోసం ఆర్ధిక శాస్త్రం పై పుస్తకాలు రాశారు.ఆధ్యాత్మిక ఆరోగ్యవిషయాలపై స్వాతంత్ర్య సమర యోధులగూర్చి ఎన్నో పుస్తకాలు పబ్లిష్ చేశారు.ఇప్పటికీ రాస్తూనే ఉంటారు.”మాకుటుంబంలో పెద్ద విషాదం నాఏకైకసోదరుడు సురేష్ బాబు సివిల్ ఇంజనీర్ హఠాత్తుగా మరణించడం 4ఏళ్ళక్రితం! తిరుమల లో దత్తపీఠం వల్లభమఠనిర్మాణంలో తమ్ముడి కృషి ఎంతో ఉంది” అని చెప్పారు విజయగారు.నిజంగా బాధాకరం.
విజయగారి భర్త శ్రీ శివ ప్రసాద్ గారు ఎం.ఎస్సీ బాటనీ సెరీకల్చర్ లో స్పెషలైజేషన్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో జాబ్ చేస్తుండగా ఆయనతో వివాహం గొప్ప మలుపు.కానీ ఆయన యూనివర్సిటీ జాబ్ వదిలి ఢిల్లీ లో వాలంటరీ ఆర్గనైజేషన్ లో చేరారు.ఈమె కూడా ఢిల్లీ లో పి.హెచ్.డి.చేశారు.కానీ రేడియో లో ఉద్యోగం రావడంతో కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది.ఆయనది టూర్లు చేసే జాబ్.ఇద్దరు కూతుళ్ళ ఆలనాపాలనా లో ఆమె అమ్మా నాన్నల తోడ్పాటుతో విజయవంతం గా రేడియో లో రాణించారు.”నాకు వినయ అని పేరు పెట్టాలనుకున్నారు. అప్పుడే నాన్న గారి కి ఉద్యోగం రావడంతో విజయ అని నామకరణం చేశారు.” ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంజనీరింగ్ చదివి పెళ్లిఅయి స్థిరపడ్డారు.ఒకమ్మాయి యు.ఎస్.అమ్మమ్మ గా కూడా ఇప్పుడు తన బాధ్యత నిర్వహిస్తున్నారు.
ఆకాశవాణి హైదరాబాద్ లో అ నుంచి అః వరకు ప్రతిదీ నేర్చుకున్నారు.ఆకాశవాణిలో ప్రతి ఉద్యోగి ఆల్ రౌండర్ గా రిటైర్ అవటం ఖాయం.ఇకతురగా జానకీరాణి గారు రిటైరైన తర్వాత పిల్లలప్రోగ్రాంలు చేశారు.శ్రీమతులు ఉషారాణి ప్రసన్న వసుమతి సరోజానిర్మల హైమవతి గార్లతో కల్సి పనిచేశారు.ఇక సర్వశ్రీ సుధామ సి.ఎస్ రాంబాబు సుధాకర్ రెడ్డి విజయరాఘవరెడ్డి గోపీచంద్ అడివి రాజబాబుగార్లతో లెక్కలేనన్ని ప్రోగ్రాంలు చేశారు.
ఇక ఉదయతరంగిణి ప్రోగ్రాం లో స్క్రిప్ట్ ఎలా చదవాలో దానిలోని మెలుకువలు నేర్పిన వారు శ్రీ సుధామ గారు.ఆయనతో ఎం.జి.శ్యామలాదేవిగారితో ఉదయతరంగిణి లో ఫామ్లీ సీరియల్ చేయడం మంచి అనుభవం.
ఇక ఆమె శ్రీశైలం మహాశివరాత్రి రోజున గర్భగుడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించే బాధ్యత
ఈశాఫౌండేషన్ అంతర్జాతీయ యోగాదినోత్సవ నిర్వహణ వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రోగ్రాంలు..ఒకటి రెండా.. ఎన్నో ఎన్నెన్నో! ఇక డాక్టర్ అబ్దుల్ కలాం గారితో మాట్లాడటం ఓమధురానుభూతి.ఇక వ్యవసాయం లో నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బొర్లాంగ్ హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వి.సి.ఎం.వి.రావుగారు కరణంమల్లీశ్వరి సినిమా నటులు డైరెక్టర్లని పరిచయాలు చేయటం ఒక ఎత్తు.కాళోజీనారాయణరావుగారి ఇంటికి వెళ్ళి రికార్డు చేశారు ఓవారంరోజులు. సినీనటి జమున తిరుపతి లో ఉన్నప్పుడు ఆమె ఇల్లు చూస్తూ వెళ్లిన విద్యార్ధిని విజయ కొన్నేళ్ల తర్వాత జమున గారి చేత సన్మానం పొందడం చిత్తూరు జిల్లా మహిళా శిరోమణి పురస్కారం జీవితంలో మధుర ఘట్టాలు.ప్రతి 2ఏళ్ళకు వచ్చే children film festival daily reports ఇవ్వడం ఓఘనకార్యం. ప్లాట్ ఫా…
పాడిపంట మంచి పేరు తెచ్చిన రేడియో ప్రోగ్రాం.అన్ని రేడియో కేంద్రాల్లో క్యాజువల్ అసిస్టెంట్స్ ఎనౌన్సర్స్ అందించిన సహకారం మరువలేనిది.children’s film festival కి రేడియో రిపోర్ట్స్ చేయడం మంచి అనుభూతి
ఆమె ఇలా అన్నారు ” వ్యక్తి లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేది ఛాన్స్ ఇచ్చేది కేవలం ఆకాశవాణి మాత్రమే.పెక్స్ ఎనౌన్సర్ రచయిత కి గుర్తింపు తెచ్చే రేడియో ని పల్లెలో కూడా చైతన్యం తెచ్చింది.”
ఈమె హైదరాబాద్ వరంగల్ కర్నూలు తిరుపతి ఆకాశవాణి లో వివిధ విభాగాల్లో చేసిన ప్రోగ్రాంలు లెక్క లేనన్ని.వరంగల్ కి అప్ అండ్ డౌన్ రైలుప్రయాణం రోజూ చేశారు.అలాగే కర్నూలు హైదరాబాద్ కి వారం తిరిగిన రోజులు ఉన్నాయి.రాయలసీమభాషలో వ్యవసాయ రంగం ప్రోగ్రాంచేసి సి.నా.రె.ప్రశంసలు పొందారు.మహిళామండలి పిల్లలప్రోగ్రాంలు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం యూత్ ప్రోగ్రాంలు.. ఆది ఇది అని లేకుండా సర్వేసర్వత్రా అన్నిటా తానై అందరితో కలిసి చేయడం గొప్ప అనుభవం డాక్యుమెంటరీలు చేశారు.”చింత తీర్చిన చింత .. సాయంచేసిన సాయంకి” పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ కామన్వెల్త్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డులు రావటం మరపురాని అనుభూతి.శ్రీ కోవూరియాదగిరిరావుగారు భీమారం (షాద్నగర్) రిటైరైన హెడ్మాస్టర్.వ్యవసాయం చేస్తున్న ఆయన తో కలిసి రైతుల్ని స్వయంగా కలవడం ఆయా ప్రాంతాలకెళ్ళి రికార్డు చేయడం గొప్ప అనుభవం అలాగే ముచ్చింతల్ జియ్య…
ఇలా తన కంఠస్వరం ద్వారా మారుమూల ప్రాంతాల్లో వారు కూడా పరిచయం ఐనారు. అందుకే రేడియో ఉద్యోగికి గుర్తింపు ఉంటుంది.వారి గళం వారికి ఆభరణం.
మామరదలు సుమలత హోం సైన్స్ గ్రాడ్యుయేట్.ఓపిక సహనంతో మా పేరెంట్స్ ని చూస్తోంది.వారికి చిన్న కూతురు గా ఆసరా భరోసా ఆమె.ఆమె కొడుకు గోకుల్ డిఫెన్స్ ఆడిటింగ్ లో పని చేస్తున్నాడు.
మావారు థియొసాఫికల్ సొసైటీ లోడైరెక్టర్ గా ఉన్నారు.ప్రశాంతంగా జీవితం గడిచిపోతోంది.” అన్న ఆమె నుంచి నేటి మహిళలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.డాక్టర్ విజయగారికి ధన్యవాదాలు తెల్పి తరుణి తరుఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను