4. సూప శాస్త్రం – సుకేషుడు
మన భారతీయులు వండుకొని అనేక రకాల వంటల ను, అవి తినడం వలన మానవులకు కలిగే లాభాలను గురించి సుకేషముని రచించాడు. ఇంకా ఇందులో కూరగాయలు, ఎన్నో రకాల పిండి వంటలు, తీపి పదార్థాలు, 108 రకాల వ్యంజనాలు పొడులు మొదలగు అనేక రకాల వంటకాలతో పాటు ఈనాటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల వంటల గురించి మనకు వివరించడం ఎంతో ఆశ్చర్యకరం గా ఉన్నది!
5. మానినీ శాస్త్రం- ఋష్యశృంగముని
వివిధ రకాల పూల గురించి, ఆ పూలతో అల్లే అనేక రకాల దండలను గురించి ఈ గ్రంథంలో ఉన్నాయి అంతేకాక స్త్రీల ఎన్నో రకాల శిరోజాలాంకరణలను వివరిస్తూ ఏ రకంగా పూలరేకులపై రహస్య సందేశాలు రాయాలో విపులీకరిస్తూ 16వ అధ్యాయాలు పొందుపరచడం ఎంతో వింత!
6. ధాతు శాస్త్రం – అశ్విని కుమార సహ.
ధాతు శాస్త్రం 7 అధ్యాయాలలో వివిధ రకాల లోహాల గురించిన మహాగ్రంథం. భూమి అంతర్భాగంలో ఎన్ని రకాల లోహాలు లభిస్తాయో కాకుండా కృత్రిమ లోహాలను తయారు చేసే విధానం, లోహాల మిశ్రమాల వలన వచ్చే ఫలితాలే కాకుండా రాగిని బంగారంగా మార్చే విధానం కూడా ఉందట. కానీ కాలగమనంలో ఈ గ్రంథానికి సరైన రక్షణ లేకపోవడం వల్ల ఈ విషయాలు చాలా వరకు నాశనం అయిపోయిందట. ఇవి కాకుండా ఈ ఋషి “విషశాస్త్రం” రచించి, దానిలో 32 రకాల విషాల విషయాలు వాటి గుణాలు, పొరపాటున అవి శరీరంలోకి వెళితే విరుగుడు పద్ధతులు వంటి వివరాలను రచించారట.