ఆరోజు సాయంత్రం మా పదవ తరగతి స్నేహితులందరం మా ఇంటి పైన కలుసుకున్నాం చాలాకాలం తర్వాత ఒకరి విషయాలు ఒకరు పంచుకున్నాం.
ఆరోజు అందరితో నేను మహారాణిలా బతుకుతున్నాను అని గర్వంగా చెప్పాను.
మేము ఉండేది రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేయడానికి పనివాళ్ళు
వంటలు హాస్టల్ నుంచి వస్తాయి బట్టలకు దోబి..ఇలా అన్నిటికి అందరూ ఉన్నారు.
అవునా! అని అందరు సంతోషం వ్యక్తం చేశారు.
పుస్తకాలు చదువుతూ..
ఉపయేగం లేని వస్తువులతో కళాకండాలు సృష్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటానని చెప్పాను.
చిన్ననాటి నుంచి శారీరకంగా ఏకష్టము ఎరగను ..
చిన్నప్పుడు బక్క పల్చగా ఉండడంతో మా తోబుట్టువులు వారి ఆటల్లో నన్ను చేర్చుకునే వారు కాదు.
దాంతో నేను అమ్మమ్మ దగ్గర చేరి ఆమె చెప్పే కథలు వింటూ ఆ కథలో నన్ను నేను ఊహించుకుంటూ నిద్రపోయేదాన్ని..
కథ చివర్లో అమ్మమ్మ కన్నమ్మ మా ఇంటికి వస్తే చీర పెడతారు అన్నారుఅంటే చీర నేను కట్టుకొని అంటే అయితే డ్రెస్ కొనిస్తారు అని చెప్పి కథ ముగించేది.
ఒక్కోసారి అక్క వాళ్ళు కూడా అమ్మ మ్మ చెప్పే కథలు వినేవారు .
నాకు ఏ చిన్న దెబ్బ తగిలిన విలవిల్లలాడిపోయేదాన్ని అది చూసి అక్క ప ఏడు మల్లెలెత్తు రాకుమారి అని ఎత్తి పొడిచేది.
నిజంగానే నేను చాలా తెల్లగా ఉండడంతో గట్టిగా నవ్వినా కూడా ముఖం ఎర్రగా అయ్యేది.
మా స్నేహితులు గట్టిగా నవ్వకే తల్లి ముఖం ఎర్రబడుతుంది అని ఏడిపించే వాళ్ళు.
పదవ తరగతిలో రసాయన శాస్త్రంలో పాఠాలు విని శాస్త్రజ్ఞురాలిని కావాలని అనుకునేదాన్ని …
ఆ తర్వాత పాలిటెక్నిక్ సీటు వస్తే ఇంజనీరింగ్ అవుతానని అనుకున్నాను కానీ…
హాస్టల్ వాతావరణం పడక ఇంటి కొచ్చేశా…
మళ్లీ బైపిసినే చదివాను తర్వాత
డి ఫార్మసీ చేయాలనుకున్నాను పాలిటెక్నిక్ సగం ఇంటర్ సగం చేయడంతో పాస్ మార్కులతో ఇంటర్ క గట్టెక్కాను దాంతో ఫార్మసీ సీటు రాలేదు.
డిగ్రీ చేశాను బీఈడీ చేయాలని కోచింగ్ కి వెళ్లే సమయంలోనే పెళ్లి కుదిరింది .
చదువా?పెళ్లా?అంటూ అమ్మ వారించడంతో కోచింగ్ కి వెళ్ళలేదు కోచింగ్ సగంలోనే ఆపేశాను.
నా స్నేహితులందరికీ బిఇడి వచ్చింది .
కానీ నాకు రాలేదు పెళ్లి తర్వాత ఎంత ప్రయత్నించినా సీటు రాలేదు..
ఇష్టం లేని బైపిసి తీసుకొని ఎంత కష్ట పడిన ఫలితం లేక పోయింది.
అయినా గాని టీచర్ అయ్యాను ఎలా అంటారా?
మా వారు స్కూల్ నడిపేవారు .
దాంట్లోనే నేను కూడా టీచర్ గా పని చేశాను కాకపోతే నాకంటూ ఓ సబ్జెక్టుగాని సిలబస్ గాని ఉండేవి కావు.
చిన్న పిల్లలకు రోజు ఒక టాపిక్ చెప్తూ చిత్రాలతోటే అక్షరాలను నేర్పించేదాన్ని ఆటలతో లెక్కల్ని నేర్పించేదాన్ని..
క్విజ్లతో జీకే నేర్పించేదాన్ని ..
స్కూల్ కాంపౌండ్ లో నిలబడితే ..
“టీచర్ మా క్లాస్ కి రండి మా క్లాస్ కి రండి” పిల్లలు అంతా పిలిచేవారు..
చిన్ననాటి నుంచి ఎక్కడికి వెళ్లినా ఏ వేడుక జరిగినా వాటి విశేషాలు రాసుకోవడం నాకు అలవాటు నా దినచర్యగా రోజు డైరీ రాసుకోవడం వల్ల రచనయందు ఇష్టం పెరిగింది .
దాంతో నవకవనం గ్రూపులో చేరి చిన్న చిన్నగా కవితలల్లుతూ కథలు రాస్తూ చిత్రాలకు గీస్తూ ..
చిత్రకవనం అని పుస్తకం కూడా రాసి నా కల నెరవేరచుకున్న
కవయిత్రి గా కళాకారిణీ నన్ను నేను మలుచుకున్నాను.
ఎన్నో కవి సమ్మేళనాలకు వెళ్లి సన్మానాలు కూడా స్వీకరించాను ..
దాంతో మా ఇంటి వాళ్లంతా మన ఇంట్లోనూ ఒక రచయిత్రి ఉందని సంతోషిస్తారు.
అది నా కెంతో ఆనందాన్ని ఇస్తుంది